ఎండకాలంలో(Summer) వడగాలులు(Heatwaves) సహజం. ఉష్ణోగ్రతలు భయంకరంగా ఉండటం కూడా సాధారణమైన విషయమే. ప్రతి ఏటా వడగాలుల వల్ల ఎంతో మంది చనిపోతున్నారు. ప్రపంచంలో వడగాలుల వల్ల సంభవించే మరణాలలో అయిదో వంతు మనదేశంలోనేనట! ప్రపంచవ్యాప్తంగా హీట్ వేవ్‌ కారణంగా ఏటా 1.53 లక్షల మందికి పైగా చనిపోతున్నారు.

ఎండకాలంలో(Summer) వడగాలులు(Heatwaves) సహజం. ఉష్ణోగ్రతలు భయంకరంగా ఉండటం కూడా సాధారణమైన విషయమే. ప్రతి ఏటా వడగాలుల వల్ల ఎంతో మంది చనిపోతున్నారు. ప్రపంచంలో వడగాలుల వల్ల సంభవించే మరణాలలో అయిదో వంతు మనదేశంలోనేనట! ప్రపంచవ్యాప్తంగా హీట్ వేవ్‌ కారణంగా ఏటా 1.53 లక్షల మందికి పైగా చనిపోతున్నారు. ఇందులో అయిదో వంతు మన దేశంలోనే చనిపోతుండడం(Death) ఆందోళన కలిగిస్తోంది. ఇండియా తర్వాత చైనా, రష్యాలలో ఎక్కువ మంది చనిపోతున్నారు. హీట్‌వేవ్‌ మరణాల్లో సగానికి సగం ఆసియా నుంచే కావడం గమనార్హం. ఆస్ట్రేలియాలోని మొనాష్‌ యూనివర్సిటీ అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. మొత్తం మరణాల్లో 30 శాతం ఐరోపా దేశాలలో సంభవిస్తున్నాయని తేలింది.

Updated On 15 May 2024 6:36 AM GMT
Ehatv

Ehatv

Next Story