World Press Freedom Day : వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో మరింత దిగజారిన భారత్ ర్యాంక్!
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకుంటున్నాం కానీ.. ఇక్కడ ప్రధాన వ్యవస్థలేవి సక్రమంగా పని చేయడం లేదు. ఇవాళ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం(World Press Freedom Day ). వరల్డ్ ప్రెస్ ఫ్రీడం డే అన్నమాట! కానీ మన దేశంలోనే కాదు, అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలలో మీడియాకు అసలు స్వేచ్ఛే లేదు.
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకుంటున్నాం కానీ.. ఇక్కడ ప్రధాన వ్యవస్థలేవి సక్రమంగా పని చేయడం లేదు. ఇవాళ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం(World Press Freedom Day ). వరల్డ్ ప్రెస్ ఫ్రీడం డే అన్నమాట! కానీ మన దేశంలోనే కాదు, అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలలో మీడియాకు అసలు స్వేచ్ఛే లేదు. ప్రతీ మీడియాకు ఒక్కో రాజకీయపార్టీ అండగా ఉంటోంది. ఇక జాతీయస్థాయిలో మీడియా అయితే బీజేపీకి(BJP) సరేండర్ అయ్యిందని వేరే చెప్పనక్కర్లేదు. అందుకే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో భారత్ ర్యాంకు నానాటికి తీసిబొట్టు అన్నట్టుగా తయారయ్యింది. 180 దేశాల్లోని పత్రికా స్వేచ్ఛను పరిగణనలోకి తీసుకున్న ఈ సూచీలో భారత్ 161వ స్థానంలో నిలిచింది. లాస్టియరే కాస్త నయం.. అప్పుడు 150వ స్థానంలో ఉండింది.
అంతకు ముందు సంవత్సరం 142వ స్థానంలో ఉండింది.. అంటే ప్రతీ సంవత్సరం దిగజారుతూనే ఉందన్నమాట!
ప్రజాస్వామ్యంలో ప్రెస్‌ను(Press) ఫోర్త్ ఎస్టేట్(fourth estate) అంటారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రెస్ ది బాధ్యతాయుతమైన పాత్ర. మన దగ్గర మాత్రం ప్రెస్ ఫ్రీడం ఏమంత గొప్పగా లేదు. ఈ విషయాన్ని అంతర్జాతీయ సూచీ తాజాగా వెల్లడించింది. ప్రతి ఏడాది ప్రఖ్యాత 'రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్(రిపోర్టర్స్ సాన్స్ ఫ్రంటియర్స్)' సంస్థ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని పత్రికాస్వేచ్చపై నివేదిక విడుదల చేస్తుంది. ఈసారి ఇండియా 161వ స్థానంలో నిలిచింది. మనకంటే పాకిస్తాన్ నయం. లాస్టియర్ 157వ స్థానంలో ఉన్న పాకిస్తాన్ ఈసారి 150 ప్లేస్‌కు వచ్చింది. శ్రీలంకలో కూడా గణనీయమైన మార్పు కనిపిస్తోంది. నిరుడు 146వ ర్యాంకులో ఉన్న శ్రీలంక ఈసారి 135కు చేరుకుంది. ఎప్పటిలాగే నార్వే, ఐర్లాండ్, డెన్మార్క్‌లు మొదటి మూడు స్థానాలలో నిలిచాయి. వియత్నాం, చైనా, నార్త్ కొరియాలు చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి.