Anjali Chakra-Sufi Malik Breakup : మరి కొద్ది రోజుల్లో పెళ్లి.. బ్రేకప్ చెప్పేసుకున్న స్వలింగ సంపర్కులు!
అంజలి చక్ర(Anjali Chakra)-సూఫీ మాలిక్(Sufi Malik) జంట అప్పట్లో సోషల్ మీడియాలో(Social media) దుమ్ము రేపింది. స్వలింగ ప్రేమికులు అయిన వీరిద్దరు సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా! అందుకే ఈ జంటకు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ప్రాధాన్యత ఇచ్చింది. కొన్నాళ్లు ప్రేమలో ఉన్న ఈ ప్రేమికులు పెళ్లితో ఏకం కావాలనుకున్నారు. పెళ్లికి కొన్ని రోజుల ముందు సడన్‌గా బ్రేకప్ చెప్పుకున్నారు. భారత్‌కు చెందిన అంజలి, పాకిస్తాన్‌కు చెందిన సూఫీ ఇద్దరూ అమెరికాలోనే ఉంటున్నారు.
అంజలి చక్ర(Anjali Chakra)-సూఫీ మాలిక్(Sufi Malik) జంట అప్పట్లో సోషల్ మీడియాలో(Social media) దుమ్ము రేపింది. స్వలింగ ప్రేమికులు అయిన వీరిద్దరు సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా! అందుకే ఈ జంటకు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ప్రాధాన్యత ఇచ్చింది. కొన్నాళ్లు ప్రేమలో ఉన్న ఈ ప్రేమికులు పెళ్లితో ఏకం కావాలనుకున్నారు. పెళ్లికి కొన్ని రోజుల ముందు సడన్‌గా బ్రేకప్ చెప్పుకున్నారు. భారత్‌కు చెందిన అంజలి, పాకిస్తాన్‌కు చెందిన సూఫీ ఇద్దరూ అమెరికాలోనే ఉంటున్నారు. అక్కడే వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లుగా వీరు సేమ్ సెక్స్ రిలేషన్‌ను(homosexual relationship) కొనసాగిస్తున్నారు. స్వలింగ సంబంధం పెట్టుకున్న వీరి పెళ్లి మరికొన్ని రోజుల్లో జరగాల్సి ఉండింది. అయితే తాము బ్రేకప్(Break up) చెప్పుకున్నామని ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. 2019లో ఈ స్వలింగ జంట వార్తల్లోకి ఎక్కింది. ఆసియాలోని చాలా దేశాలలో ఎల్‌జీబీటీక్యూ ప్లస్‌పై(LGBTQ+) నిషేధం ఉన్న నేపథ్యంలో వీరి స్వలింగ సంబంధం అప్పట్లో సంచలనం సృష్టించింది. పెళ్లి చేసుకోవాలనుకున్న తమ నిర్ణయాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకున్నామని, తమ సంబంధం ఇంతటితో ముగిసిపోయిందని అంజలి తెలిపారు. తన వరకు ఇది షాకింగేనని ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది.
సూఫీ అవిశ్వాసం కారణంగానే పెళ్లిని రద్దుచేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నామని అంజలి తెలిపారు. సూఫీ మాలిక్ విషయంలో తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని తెలిపింది. మాలిక్ కూడా బ్రేకప్‌పై స్పందించారు. పెళ్లికి కొన్ని వారాల ముందు తాను అంజలిని మోసం చేసి, ఆమెకు తీరని ద్రోహం చేశానని సూఫీ మాలిక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెను బాధపెట్టానని ఒప్పుకున్నారు. తప్పంతా తనదేనని చెప్పారు. అయితే ఆ తప్పు ఏమిటన్నది మాత్రం చెప్పలేదు. సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అంజలి చక్ర ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉంటున్నారు. ఈవెంట్ ప్లానర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా పని చేశాఉ. పోస్టుగ్రాడ్యుయేషన్ తర్వాత కొన్నాళ్లు ఓ హెల్త్‌కేర్‌లో పనిచేశారు. సూఫీ మాలిక్ విషయనికి వస్తే 27 ఏళ్ల ఆ యువతి పాకిస్తాన్‌కు చెందినవారు. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్. లైఫ్‌స్టైల్, ఫ్యాషన్ కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. సూఫీ తత్వశాస్తం నుంచి ఇన్‌స్పైయిర్ అయిన మాలిక్ తన పేరుకు ముందు సూఫీ అనే పదాన్ని చేర్చుకున్నారు. ఫోటోగ్రఫీలో ఇంట్రెస్ట్ ఉంది. ప్రస్తుతం న్యూమార్క్‌లో ఉంటున్న సూఫీ అక్కడి నుంచే ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, ట్రావెలింగ్‌పై కంటెంట్ షేర్ చేస్తూ ఉంటుంటారు. అంజలితో స్నేహం తర్వాత దీక్ష కూడా ఫేమస్ అయ్యారు. వీరిద్దరికీ కలిపి సూఫీ అండ్ అంజలీ పేరుతో ఒక యూట్యూబ్ చానల్ కూడా ఉంది.