నైరుతి రుతుపవనాలు(Mansoon) ఈ ఏడాది ముందుగానే రావడంతో సంతోషించాం. వర్షాతిరేకం చెందాం. ఇక వానలు కురుస్తాయని, పంటలు పండినట్టేనని రైతులు మురిసిపోయారు.
నైరుతి రుతుపవనాలు(Mansoon) ఈ ఏడాది ముందుగానే రావడంతో సంతోషించాం. వర్షాతిరేకం చెందాం. ఇక వానలు కురుస్తాయని, పంటలు పండినట్టేనని రైతులు మురిసిపోయారు. కానీ ఇప్పటి వరకు 20 శాతం తక్కువ వర్షపాతం(rainfall) నమోదవ్వడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. జూన్ 12-18 మధ్య రుతుపవనాల కదలికలలో పెద్దగా పురోగతి కనిపించలేదని భారత వాతావరణ విభాగం చెబుతోంది. కాకపోతే రాబోయే మూడు నాలుగు రోజుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కోస్తాంధ్ర, బీహార్, జార్కండ్‌లో పరిస్థితులు అనుకూలంగా మారనున్నాయని ఐఎండీ తెలిపింది. జూన్ 1-18 మధ్య మనదేశంలో 64.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. సాధారణంగా ఈ సమయంలో సగటున 80.6 మిమీ వర్షపాతం కురవాల్సి ఉంది. జూన్ 1వ తేదీ నుంచి భారత వాయువ్య ప్రాంతంలో 10.2 మిమీ అంటే సాధారణం కంటే 70 శాతం తక్కువ, మధ్య భారత్‌లో 50.5 మిమీ అంటే సాధారణం కంటే 31శాతం తక్కువ, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో 146.7 మిమీ అంటే సాధారణం కంటే 15శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్టు ఐఎండీ పేరొన్నది. ఒక్క దక్షిణాదిలోనే సాధారణం కంటే 16 శాతం ఎక్కువగా 106.6 మిమీ వర్షపాతం నమోదయ్యింది.