దేశంలోని తొలి ప్రైవేట్ రైలు(Private train) జూన్ 4వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది. కేరళ లోని తిరువనంతపురం(Thiruvanthapuram) నుంచి గోవా(Goa) వరకూ రాకపోకలు సాగించనుంది. ఎస్ఆర్ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్(SRMPR Global PVTLTD) సంస్థ ఈ రైలు సర్వీసును నిర్వహిస్తుంది. భారత్ గౌరవ్ యాత్ర ప్రాజెక్టులో భాగంగా భారతీయ రైల్వే, ప్రిన్సి వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేటు లిమిటెడ్ సంయుక్త సహకారంతో ఈ సర్వీసును నిర్వహిస్తారు.

India Private Train
దేశంలోని తొలి ప్రైవేట్ రైలు(Private train) జూన్ 4వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది. కేరళ లోని తిరువనంతపురం(Thiruvanthapuram) నుంచి గోవా(Goa) వరకూ రాకపోకలు సాగించనుంది. ఎస్ఆర్ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్(SRMPR Global PVTLTD) సంస్థ ఈ రైలు సర్వీసును నిర్వహిస్తుంది. భారత్ గౌరవ్ యాత్ర ప్రాజెక్టులో భాగంగా భారతీయ రైల్వే, ప్రిన్సి వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేటు లిమిటెడ్ సంయుక్త సహకారంతో ఈ సర్వీసును నిర్వహిస్తారు. తిరువనంత పురంలో మొదలయ్యే ఈ రైలు త్రివేండ్రం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిస్సూర్, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్ మీదుగా గోవా చేరుకుంటుంది. ఈ రైల్లో 2 స్లీపర్ కోచ్‌లు, 11 థర్డ్ క్లాస్ ఏసీ కోచ్‌లు, 2 సెకెండ్ క్లాస్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. ఈ రైల్లో ఒకేసారి 750 మంది ప్రయాణించవచ్చు. వైద్య నిపుణులతో పాటు మొత్తం 60 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. భోజన వసతి, వై ఫై, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ వంటివి ఏర్పాటు చేశారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాల సందర్శనకు అనువుగా టూర్ ప్యాకేజీ లను రెడీ చేశారు..
