గత కొన్నేళ్లుగా భారతదేశం(India)లో స్మార్ట్‌ఫోన్(Smart Phones) వినియోగం భారీగా పెరిగింది. దీంతో మార్కెట్ కూడా బాగా అబివృద్ధి చెందింది. ఫ‌లితంగా త‌యారీ మార్కెట్ కూడా భార‌త్‌లో విస్త‌రించింది. ఈ నేప‌థ్యంలోనే భార‌త్ ఓ సరికొత్త రికార్డును సృష్టించింది. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో.. మొబైల్‌ఫోన్‌లను విక్రయించడంలో భారతదేశం రెండవ స్థానంలో నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం 85 వేల కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను ఎగుమ‌తి చేసింది. ఈ గణాంకాలను ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ విడుదల చేసింది.

గత కొన్నేళ్లుగా భారతదేశం(India)లో స్మార్ట్‌ఫోన్(Smart Phones) వినియోగం భారీగా పెరిగింది. దీంతో మార్కెట్ కూడా బాగా అబివృద్ధి చెందింది. ఫ‌లితంగా త‌యారీ మార్కెట్ కూడా భార‌త్‌లో విస్త‌రించింది. ఈ నేప‌థ్యంలోనే భార‌త్ ఓ సరికొత్త రికార్డును సృష్టించింది. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో.. మొబైల్‌ఫోన్‌లను విక్రయించడంలో భారతదేశం రెండవ స్థానంలో నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం 85 వేల కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను ఎగుమ‌తి చేసింది. ఈ గణాంకాలను ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ విడుదల చేసింది. మొబైల్ ఫోన్ల‌ తయారీలో స్థానికత‌ను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగానే భారత్.. ఈ రికార్డ్‌ సాధించిందని నివేదికలో చెప్పబడింది.

మొబైల్ ఫోన్ ఎగుమతులకు సంబంధించి గణాంకాల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం భారతదేశంలో మొబైల్ ఫోన్ ఎగుమతులు రెట్టింపు అయ్యాయి. స్థానికంగా తయారీని ప్రోత్సహించడం ద్వారా.. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ తయారీ దేశంగా అవతరించింది. భారతదేశంలో విక్రయించబడుతున్న మొత్తం మొబైల్ ఫోన్‌లలో 97 శాతం దేశంలోనే తయారవుతున్నాయి. భారతదేశం మొబైల్ ఫోన్ లను ఎగుమతి చేసే ఐదు ప్రధాన దేశాలలో యుఎఇ, అమెరికా, ఇటలీ, యుకె, నెదర్లాండ్స్ ఉన్నాయి. ఐఫోన్ తయారీపై కూడా భారీ ఒప్పందం కుదిరిన‌ట్లు నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం.. 2027 నాటికి చైనా ఐఫోన్(China IPhone) తయారీ సామర్థ్యంలో 45-50 శాతం భారత్ సొంతం చేసుకోనుంది. 2022లో భారత్‌ ఐఫోన్(india IPhone) తయారీ సామర్థ్యం దాదాపు 10-15 శాతంగా నివేదిక‌లో చెప్ప‌బ‌డింది.

Updated On 10 April 2023 2:11 AM GMT
Ehatv

Ehatv

Next Story