Indian Club : చారిత్రాత్మక రెస్టారెంట్‌కు ఆఖరి రోజులు! ఎందుకు మూతపడుతున్నదంటే..!
అది సాధారణ రెస్టారెంట్(Restaurant) కాదు! దేశ స్వాతంత్య్రానికి(country Freedom) సంబంధించిన చరిత్రకు నిలువెత్తు నిదర్శనమది! ఎందరో త్యాగధనులకు ఆతిథ్యమిచ్చిన చారిత్రాత్మక క్లబ్ అది! మరికొద్ది రోజుల్లో ఆ రెస్టారెంట్ మూతపడబోతున్నది. ఓ ఘనమైన కట్టడం(Heritage construction) ఆనవాలు లేకుండా పోతున్నది.. ఆ ఐకానిక్ రెస్టారెంట్ ఇన్నది బ్రిటన్(Britain) రాజధాని లండన్‌లో(London)! ఈ రెస్టారెంట్‌ను ఇండియా క్లబ్(Indian Club) అని కూడా అంటారు. సెంట్రల్ లండన్‌లో రద్దీగా ఉండే రోడ్డులో హోటల్ స్ట్రాండ్ కాంటినెంటల్ లోపల ఉన్న ఇండియా క్లబ్‌ను తెలియని దక్షిణాసియా ప్రజలు ఆ నగరంలో ఉండరంటే అతిశయోక్తి కాదు.

దశాబ్దాలుగా ప్రజలకు రుచికరమైన వంటకాలను వడ్డిస్తున్న ఆ రెస్టారెంట్ మూతపడటం ఓ విషాదం. ఎన్నో రకాల దక్షిణ భారతదేశ వంటకాలను పరిచయం చేసిన ఘనత ఆ రెస్టారెంట్‌కు దక్కుతుది. అయిదో దశకంలో భారతీయ వలసదారులను కలుసుకునేందుకు ఓ ప్రదేశం ఏర్పాటయ్యింది. దీనిని ఇండియా లీగ్ సభ్యులు(Indian league Members) ప్రారంభించారు. 1900లలో బ్రిటన్‌కు చెందిన ఓ సంస్థ ఈ క్లబ్‌లో భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం ప్రచారం చేసింది. స్వాతంత్ర్య యోధులు దీన్ని ఓ సమావేశ స్థలంగా ఉపయోగించుకున్నారు.
తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఈ క్లబ్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. అయిదారు దశకాలలో ఇక్కడ స్థిరపడిన భారతీయులు తమ దేశ ఆహారం కోసం ఇక్కడకు క్రమం తప్పకుండా వచ్చేవారు. పుట్టిన రోజు వేడుకలు, వివాహాలు, పండుగలు, పబ్బాలు ఇక్కడ జరుపుకునేవారు. లండన్‌లో ఎన్‌ఆర్‌ఐల కోసం సాంస్కృతిక సంస్థలు లేని లోటును ఇండియా క్లబ్ తీర్చింది. ఈ రెస్టారెంట్‌లో దక్షిణభారతానికి చెందిన అన్ని వంటకాలు దొరికేవి. దోశలు, ఇడ్లీలు, మసాల కర్రీలు, వడలు, కాఫీ, చాయ్ .. అలా అన్ని వంటకాలను అందించేది. ఈ రెస్టారెంట్‌లో 70 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన స్ట్రెయిట్ బ్యాక్డ్ కుర్చీలనే ఇప్పటికీ వాడుతున్నారు.
ఇంతటి చరిత్ర ఉన్న ఈ క్లబ్ మరికొద్ది రోజుల్లో మూతపడుతున్నది. ఆ భవనం ఉన్న ప్రదేశంలోని యజమానులు నిర్మాణంలో కొంత భాగాన్ని కూల్చివేయాలని కోరుతున్నారు. కూల్చివేసిన స్థానంలో ఆధునాతన హోటల్‌ను నిర్మించాలనుకుంటున్నారు. అయితే ఈ కూల్చివేతకు వ్యతిరేకంగా చాలా మంది పోరాడుతున్నారు. క్లబ్ యజమానులు యాద్గార్ మార్కర్, ఆయన కూతురు ఫిరోజాలు కూడా తమ స్థలాన్ని కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. వేలాది మంది మద్దతును కూడగట్టుకున్నారు. అయినప్పటికీ సెప్టెంబర్ 17 క్లబ్‌కు చివరి రోజు కానుంది.