ఇండియా కూటమికి(INDIA Alliance) మొదటి పోరులోనే ఎదురుదెబ్బ తగిలింది. కూటమిలోని పార్టీలు కాంగ్రెస్(Congress), ఆమ్ ఆద్మీ పార్టీలు(Aam Admi Party) కలిసి తొలిసారి చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో(Mayor Elections) పోటీ చేశాయి. పరోక్షంగా జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీకి(BJP) చెందిన మనోజ్ సొంకార్(Manoj Sonkar) మేయర్‌గా విజయం సాధించాడు

Manoj Sonkar
ఇండియా కూటమికి(INDIA Alliance) మొదటి పోరులోనే ఎదురుదెబ్బ తగిలింది. కూటమిలోని పార్టీలు కాంగ్రెస్(Congress), ఆమ్ ఆద్మీ పార్టీలు(Aam Admi Party) కలిసి తొలిసారి చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో(Mayor Elections) పోటీ చేశాయి. పరోక్షంగా జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీకి(BJP) చెందిన మనోజ్ సొంకార్(Manoj Sonkar) మేయర్‌గా విజయం సాధించాడు. మొత్తం 35 ఓట్లు ఉన్న కౌన్సిల్‌లో బీజేపీకి 14 మంది ఉన్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి 13 మంది, కాంగ్రెస్‌కు ఏడుగురు, శిరోమణి అకాలీదళ్‌కు ఒక సభ్యుడు ఉన్నారు. ఈ లెక్కన ఇండియా కూటమి ఈజీగా గెలవాలి. కానీ ప్రిసైడింగ్ ఆఫీసరు బీజేపీకి ఫేవర్ చేశారు. ఎనిమిది మంది సభ్యులను ఓటింగ్‌లో పాల్గొనకుండా డిస్‌క్వాలిఫై చేశారు. దాంతో బీజేపీ అభ్యర్థికి 15 ఓట్లు వచ్చాయి. ఇండియా కూటమి అభ్యర్థి కుల్దీప్ కుమార్‌కు 12 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ అభ్యర్థి విజయం సాధించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రియాక్టయ్యారు. బీజేపీ పట్టపగలు మోసం చేసి మేయర్ సీటు గెలిచిందని ట్వీట్ చేశారు. మేయర్ ఎన్నిక కోసమే బీజేపీ ఇంత దిగజారితే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ ఇంకెంతకైనా తెగిస్తుందని కేజ్రీవాల్ మండిపడ్డారు.
