హర్యానా(Haryana) రాష్ట్ర రాజకీయాలలో పరిణామాలు చకచకమంటూ మారుతున్నాయి. నాయబ్‌సింగ్ సైనీ(Nayab) సారథ్యంలోని బీజేపీ సర్కారు ఇప్పుడు రోజులు లెక్కపెడుతున్నది. ఇప్పటి వరకు బీజేపీ(BJP) ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలలో ముగ్గురు మద్దతు ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు హర్యానా గవర్నర్‌కు లేఖ కూడా రాశారు.
హర్యానా(Haryana) రాష్ట్ర రాజకీయాలలో పరిణామాలు చకచకమంటూ మారుతున్నాయి. నాయబ్‌సింగ్ సైనీ(Nayab Singh Saini) సారథ్యంలోని బీజేపీ సర్కారు ఇప్పుడు రోజులు లెక్కపెడుతున్నది. ఇప్పటి వరకు బీజేపీ(BJP) ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలలో ముగ్గురు మద్దతు ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు హర్యానా గవర్నర్‌కు లేఖ కూడా రాశారు. లోక్‌సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్‌కు(congress) మద్దతు ఇస్తామని ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సోంబిర్ సంగ్వాన్, రణ్‌ధీర్ గొల్లెన్, ధరమ్‌పాల్ గొండెర్ ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు భూపిందర్ సింగ్ హుడా(Bhupinder Singh Hooda), హర్యానా పీసీసీ అధ్యక్షుడు ఉదయ్ భాన్‌తో(Uday Bhan) కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీపై తీవ్రమైన విమర్శలు చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ సర్కార్ విఫలమైందని, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలు తీవ్రమయ్యాయని వీరు ఆరోపించారు. 2019లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 90 స్థానాలలో బీజేపీ 40 సీట్లు గెల్చుకుంది. పది సీట్లు జన్‌నాయక్ జనతా పార్టీ గెల్చుకుంది. ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, హర్యానా లోకిత్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సపోర్ట్‌తో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇటీవల ఎన్నికల సీట్ల పంపకాలలో తేడాలు రావడంతో బీజేపీకి జన్‌నాయక్ జనతాపార్టీ రామ్‌రామ్ చెప్పేసింది. ఇప్పుడు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్నారు. అయితే, పది మంది జేజేపీ ఎమ్మెల్యేల్లో ఇద్దరు బీజేపీకి మద్దతు తెలిపారు. ప్రస్తుతం 88 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రభుత్వం మనుగడ సాగించాలంటే 45 ఎమ్మెల్యేల బలం కావాలి. 40 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు జేజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్రులు, ఒక హర్యానా లోకిత్ పార్టీ ఎమ్మెల్యే మద్దతు ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వానికి ఉంది.