భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది అర్ధరాత్రి వేళనే అయినప్పటికీ మనం ఆ ఆనందోత్సవాలను ప్రతీ ఆగస్టు 15న ఉదయమే జరుపుకుంటాం! త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తాం. కానీ బీహార్‌లోని పుర్నియా అనే ప్రాంతంలో మాత్రం అర్ధరాత్రే స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. అనాదిగా అక్కడ వస్తున్న సంప్రదాయమదే!
భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది అర్ధరాత్రి వేళనే అయినప్పటికీ మనం ఆ ఆనందోత్సవాలను ప్రతీ ఆగస్టు 15న ఉదయమే జరుపుకుంటాం! త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తాం. కానీ బీహార్‌లోని పుర్నియా అనే ప్రాంతంలో మాత్రం అర్ధరాత్రే స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. అనాదిగా అక్కడ వస్తున్న సంప్రదాయమదే! పుర్నియా(Purnia) ప్రజలు అర్థరాత్రి 12.01 గంటలకు జెండా చౌక్(Jhanda Chowk) అనే ప్రాంతంలో జెండాను ఎగరేసి సంబరాలు జరుపుకుంటారు. 1947 నుంచి ఇలాగే చేస్తున్నారు. ఇప్పటికీ ఆ సంప్రదాయాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. 'బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి విముక్తి లభించింది. మనకు స్వాతంత్ర్యం వచ్చింది' అంటూ భారతదేశం తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ(Jawaharlal Nehru) చేసిన ప్రసంగాన్ని రేడియోలకు అతుక్కుపోయి మరీ విన్నారు. పండిట్ నెహ్రూ ఆ ప్రకటన చేయగానే, పుర్నియాకు చెందిన రామేశ్వరప్రసాద్ సింగ్(Rameshwar Prasad Singh), దాదాపు పదివేలమంది వ్యక్తులతో కలిసి అర్థరాత్రి ఆ క్షణమే జెండా ఎగరువేసి వారంతా సంబరాలు చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి దీన్ని ఒక ఆచారంగా పాటిస్తూ వస్తున్నారు. ఇంతవరకు ఎప్పుడూ ఈ వేడుకల్లో ఆటంకం ఎదురుకాలేదని అంటున్నారు పుర్నియా ప్రజలు. ప్రస్తుతం రామేశ్వరప్రసాద్ సింగ్ వారసులు దీన్నికొనసాగిస్తున్నట్లు చెప్పారు. రామేశ్వర ప్రసాద్ మరణాంతరం ఆయన కూతురు సురేఖ దీన్ని పాటించారని, ఇప్పుడూ మనవడు విపుల్(Vipul) ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు.