☰
✕
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో గుర్తుతెలియని వ్యక్తులు ఒక ఎస్‌యూవీ కారును వదిలిపెట్టి వెళ్ళారు.
x
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో గుర్తుతెలియని వ్యక్తులు ఒక ఎస్‌యూవీ కారును వదిలిపెట్టి వెళ్ళారు. విశేషమేమిటంటే అందులో భారీగా నగదు, బంగారం(Gold) లభించడమే. కుశల్‌పురా రోడ్డులో ఇన్నోవా క్రిస్టా కారు నిలిపి ఉందని, అందులో చాలా మూటలు కనిపిస్తున్నాయని, మనుషులు మాత్రం లేరని గురువారం రాత్రి పోలీసులకు సమాచారం అందింది. దాంతో ఐటీ శాఖకు కూడా సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకుని కారు కిటికీ అద్దాలు పగలగొట్టి 52 కిలోల బంగారు బిస్కెట్లను, భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎంపీ-07 సిరీస్‌లో వాహనం నంబర్ రిజిస్టర్ అయి ఉందని, దాని యజమాని పేరు చందన్ సింగ్ గౌర్‌గా నమోదై ఉందని డీసీపీ చెప్పారు. గ్వాలియర్‌కు చెందిన ఆ వ్యక్తి గత కొంత కాలంగా భోపాల్‌లో నివసిస్తున్నట్టు తెలిపారు.
ehatv
Next Story