మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టేందుకు ఎన్ని చట్టాలు తెచ్చినా కొందరు కామాంధులు వాటిని లెక్కచేయరు
మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టేందుకు ఎన్ని చట్టాలు తెచ్చినా కొందరు కామాంధులు వాటిని లెక్కచేయరు. మహిళలపై లైంగికదాడులు, అత్యాచారాలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. మైనర్ బాలుడి నుంచి ముసలి నక్కల వరకు మహిళలను వదలడం లేదు. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని బిసౌలిలో(Bisoli) ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని బిసోలిలో ఓ ముసలోడి చేష్టలు చూస్తే చీచీ అనుకుంటాం. ఓ దుకాణంలో షాపింగ్ చేసేందుకు ఓ యువతి వచ్చింది. అయితే ఆ యువతి ఓ వృద్ధుడి పక్కనే నిలబడింది. షాపింగ్ చేస్తూ ఆ యువతి బిజీగా ఉండిపోయింది. తన వెంట వచ్చినవారితో షాపింగ్‌లో మునిగిపోయింది. సరిగా అప్పుడే ఈ వృద్ధ టెంకాయి తన పనిచేయడం ప్రారంభించాడు. పదే పదే యువతి జుట్టును పట్టుకునేందుకు ప్రయత్నించాడు. కాదుకాదు పట్టుకున్నాడు. ఓ సారి అయితే జుట్టును అమాంతం చేతిలోకి తీసుకొని ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూశాడు. తొలుత ఈ ముసలి కామాంధుడికి జుట్టు అందకున్నా పదే పదే ప్రయత్నిస్తూ చివరికి ఆమె జట్టును అందుకున్నాడు. మరోసారి కూడా అదే పనిచేసి జుట్టు వాసన చూశాడు. ఆమె తిరిగి వెళ్లిపోతుంటే కూడా మరోసారి ఆమె వైపు తిరిగి జుట్టును అందుకునే ప్రయత్నం చేశాడు. ఇంతా చేస్తున్నా యువతికి మాత్రం ఈ విషయం తెలియలేదు. తనను ఎవరూ గమనించడం లేదని మరింత రెచ్చిపోయాడు. కానీ చుట్టుపక్కల ఉన్న జనాల కంటి నుంచి తప్పించుకున్నా సీసీ కెమెరాల కన్ను ఊరుకుంటదా. ప్రతీది రికార్డ్ చేస్తుంది కాదా.. ఆమాత్రం కొనుక్కోలేకపోయాడు. అయితే ఈ వీడియోని దుకాణం నిర్వాహకులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కొద్ది సమయంలోనే ఈ వీడియో వేలల్లో రీచయింది. ముసలోడు చేసిన పనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. 'ఓరి ముసలోడా నీకేం పోయే కాలం వచ్చింది రా' అని ఒకరు స్పందిస్తే.. ముసలోడికి బట్టతల ఉందన్న బాధతో యువతి జుట్టును పట్టుకునేందుకు ప్రయత్నించాడని మరొకరు కామెంట్ చేయగా.. ముసలోడి లీలలు చూశాకైనా పోలీసులు తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.