ప్రయాణికుల రద్దీలో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు(Hyderabad Airport) మరో ఘనత సాధించింది. డిసెంబర్ నెలలో దేశంలో అత్యధికంగా ప్రయాణికుల(Passenger) రాకపోకలు సాగించిన అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో రెండో స్థానంలో నిలిచింది.
ప్రయాణికుల రద్దీలో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు(Hyderabad Airport) మరో ఘనత సాధించింది. డిసెంబర్ నెలలో దేశంలో అత్యధికంగా ప్రయాణికుల(Passenger) రాకపోకలు సాగించిన అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో రెండో స్థానంలో నిలిచింది. డిసెంబర్‌లో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఏకంగా 22.51 లక్షల మంది ప్రయాణాలు జరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు 1.8 కోట్ల మంది రాకపోకలు కొనసాగించినట్లు తెలిపారు.
మరోవైపు హైదరాబాద్‌లోని బేగంపేట్‌లో వింగ్స్ ఇండియా-2024 ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ దేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య శరవేగంగా పెరుగుతోందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. గత కొంతకాలంగా విమానయాన రంగం ఏటా 10-15శాతం వృద్ధి చెందుతుందని అన్నారు. 2023లో 15.3 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారని, 2030 నాటికి ఈ సంఖ్య 30 కోట్లకు పెరుగుతుందని అన్నారు.