మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్ ఆఫ్‌ ఇండియా చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను కాపాడే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. బీజేపీకి చెందినవారెవ్వరూ దీనిపై పెదవి విప్పకపోవడం దేశ ప్రజలకు ఆశ్చర్యాన్ని, అసహనాన్ని కలిగిస్తోంది. కేంద్రమంత్రులైతే సమాధానం చెప్పలేక పరుగులు తీస్తున్నారు.

మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్ ఆఫ్‌ ఇండియా చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను కాపాడే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. బీజేపీకి చెందినవారెవ్వరూ దీనిపై పెదవి విప్పకపోవడం దేశ ప్రజలకు ఆశ్చర్యాన్ని, అసహనాన్ని కలిగిస్తోంది. కేంద్రమంత్రులైతే సమాధానం చెప్పలేక పరుగులు తీస్తున్నారు. అయితే ఢిల్లీ కన్నాట్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లోని కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. మహిళా అథ్లెట్లను బ్రిజ్‌భూషణ్‌ అసభ్యకరమైన రీతిలో తాకినట్టు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. మహిళా అథెట్ల శ్వాసను పరిశీలించాలన్న నెపంతో బ్రిజ్‌ అథెట్లను అనుచి రీతిలో తడిమినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలా అథ్లెట్లను పరీక్షిస్తున్న సమయంలో సంబంధం లేని ప్రశ్నలు వేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఏదైనా టోర్నమెంట్‌లో అథెట్లు గాయపడితే, వారి చికిత్స ఖర్చు భరించడానికి తన లైంగిక వాంఛలు తీర్చాలని వేధించినట్టు బ్రిజ్‌పై ఆరోపణలు ఉన్నాయి. డైటీషియ‌న్ కానీ కోచ్ కానీ పర్మిషన్‌ ఇవ్వనటువంటి ఫుడ్‌ను తీసుకోవాలని బ్రిజ్‌ సూచించేవారట! ఓ మైన‌ర్ అథ్లెట్ వ‌క్షోజాల‌ను బ్రిజ్‌భూషణ్‌ తన చేతులతో త‌డిమినట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ అథ్లెట్‌ను వెంబ‌డించిన‌ట్లు కూడా ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. సాక్షీ మాలిక్‌, వినేశ్ ఫోగ‌ట్‌తో పాటు ఇత‌ర ఏడుమంది రెజ్లర్లు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు పోలీసులు. కానీ బ్రిజ్‌ భూషణ్‌ మాత్రం ఎప్పటిలాగే తనపై వచ్చిన ఆరోపణలు అసత్యాలని అంటున్నారు. ఏ ఒక్క ఆరోపణ రుజువైనా తాను ఉరి వేసుకుంటానని చాలెంజ్‌ చేశాడు. బ్రిజ్‌ భూషణ్‌ నుంచి తప్పించుకోవడానికి తామంతా తమ గదుల్లోంచి అంరం కలిసికట్టుగా బయటకు వెళ్లేవారమని, , ఒంటరిగా ఎవరైనా వెళితే మాత్రం అనుచిత ప్రశ్నలతో వేధించేవాడని మహిళా రెజ్లర్లు అంటున్నారు. బ్రిజ్‌ భూషణ్‌తో పాటు రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ సెక్రటరీ వినోద్‌ తోమర్‌ కూడా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించేవాడట! బ్రిజ్‌ భూషణ్‌పై మొత్తం రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ సెక్ష‌న్ 353, 354ఏ, 354డీ, 34 కింద ఫిర్యాదులు న‌మోదు అయ్యాయి. మైన‌ర్ అథ్లెట్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోక్సోలోని సెక్ష‌న్ 10 కింది కేసు రాశారు.

Updated On 2 Jun 2023 2:48 AM GMT
Ehatv

Ehatv

Next Story