అయోధ్యలో (Ayodhya) ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. కొత్తగా నిర్మితమవుతున్న రామాలయంలో (Ramalayam) జనవరి 22వ తేదీన బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరగనుంది. అదే రోజున ఇక్కడి రామ్‌ఘాట్‌లోని తులసీబారి దగ్గర అత్యంత భారీ దీపాన్ని ( Huge Lamp) వెలిగించనున్నారు
అయోధ్యలో (Ayodhya) ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. కొత్తగా నిర్మితమవుతున్న రామాలయంలో (Ramalayam) జనవరి 22వ తేదీన బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరగనుంది. అదే రోజున ఇక్కడి రామ్‌ఘాట్‌లోని తులసీబారి దగ్గర అత్యంత భారీ దీపాన్ని ( Huge Lamp) వెలిగించనున్నారు. 28 మీటర్ల వ్యాసంకలిగిన ఈ దీపాన్ని వెలిగించడానికి 21 క్వింటాళ్ల నూనె అవసరం అవుతుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ (Guinness Book of World) రికార్డులలో ఈ భారీ దీపం చోటు సంపాదించుకోబోతున్నది. అందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ దీపం పేరు దశరథ్ దీప్ (Dasharath Deep). ఈ దీపాన్ని తయారు చేయడానికి చార్‌ధామ్‌తో (Chardham) పాటు పలు పుణ్యక్షేత్రాలలోని మట్టి, నదులు, సముద్ర జలాలను వినియోగించారు. తపస్వి కంటోన్మెంట్‌కు చెందిన స్వామి పరమహంస పలు గ్రంథాలు, పురాణాలను అధ్యయనం చేసి, త్రేతాయుగం నాటి దీపం ఆకారాన్ని సిద్ధం చేస్తున్నారు. దీప నిర్మాణం దాదాపు పూర్తి అయ్యింది. ఈ దీపాన్ని తయారు చేయడానికి 108 మందితో కూడిన బృందం అహర్నిశలు పాటుపడింది. దీపం తయారీకి ఏడున్నర కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. ఈ దీపానికి వినియోగించే వత్తి కోసం 1.25 క్వింటాళ్ల పత్తిని (Cotton) సిద్ధం చేశారు.