In A First For Kerala : సీఎస్‌గా భర్త పదవీ విరమణ.. వెంటనే బాధ్యతలు చేపట్టిన భార్య

తన భర్త రిటైర్మెంట్ తర్వాత కేరళ(Kerala)ప్రధాన కార్యదర్శిగా(Chief Secretary) భార్య బాధ్యతలు చేపట్టడం రాష్ట్ర చరిత్రలో తొలిసారి. ఆగస్టు 31న ప్రభుత్వ సర్వీసు నుంచి పదవీ విరమణ విరమణ చేసిన ప్రధాన కార్యదర్శి వి.వేణు(V Venu).భర్త వేణు పదవీ విరమణ చేపట్టిన వెంటనే చీఫ్‌ సెక్రటరీగా భార్య శారద(Sharada)బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం అడిషనల్ చీఫ్ సెక్రటరీగా(Additional Chief Secretary ) పనిచేస్తున్న వేణు భార్య శారదా మురళీధరన్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. కేరళ సివిల్‌ సర్వీస్‌(Kerala Civil Service)లో ఉన్న ఈ దంపతులు ఒకరి నుంచి మరొకరికి కలెక్టర్‌ బాధ్యతలను బదిలీ చేసుకున్నట్లు సీఎం విజయన్‌ (CM Vijayan) తన గుర్తు చేశారు. ప్రధాన కార్యదర్శి పదవిని భర్త తన భార్యకు అప్పగించడం కేరళ చరిత్రలో ఇదే తొలిసారి అని అన్నారు. ఈ అరుదైన మార్పుపై శారద మురళీధరన్(Sharada murali dharan) మాట్లాడుతూ, ఆగస్టు 31న పదవీ విరమణ చేయనున్న తన భర్తకు వీడ్కోలు పలకడం తనకు ఒక విచిత్రమైన క్షణమని అన్నారు. వేణు పదవీ విరమణ తర్వాత ఎనిమిది నెలల పాటు శారద ఈ సర్వీసులో కొనసాగాల్సి ఉంటుంది. వేణుకు వీడ్కోలు పలికిన సీఎం విజయన్‌ తన ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఏళ్ల తరబడి చేసిన భార్యాభర్తల కృషిని ప్రశంసించారు.

ehatv

ehatv

Next Story