మనం ఇక్కడ ముదిరిన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. ఢిల్లీ(Delhi) ప్రజలేమో భారీ వర్షంతో ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో శనివారం ఉదయం నుంచి భారీ వర్షం(Heavy Rains) కురుస్తోంది. ఘజియాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్‌తో పాటుగా ఎన్‌సీఆర్ ప్రాంతాలలో ఎడతెగని వర్షం కురుస్తోంది.
మనం ఇక్కడ ముదిరిన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. ఢిల్లీ(Delhi) ప్రజలేమో భారీ వర్షంతో ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో శనివారం ఉదయం నుంచి భారీ వర్షం(Heavy Rains) కురుస్తోంది. ఘజియాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్‌తో పాటుగా ఎన్‌సీఆర్ ప్రాంతాలలో ఎడతెగని వర్షం కురుస్తోంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పిడుగులు(Lighthning) పడే అవకాశం కూడా ఉందట! ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్‌లో శనివారం అంటే ఇవాళ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. దాంతో పాటు వడగళ్ల వాన కురవొచ్చు. లక్నో, బిజ్నోర్, మీరట్, బరేలీ, రాంపూర్, రాయ్ బరేలీ, గోరఖ్‌పూర్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మబ్బులతో నిండి ఉంది. బీహార్, జార్ఖండ్, రాజస్థాన్‌లలో చిరు జల్లులు కురవొచ్చు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మంచు పడుతోంది. ఈ రోజు ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లలో వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారింది.