AP weather Forecast : ఏపీకి పొంచి ఉన్న మరో తుఫాన్ ముప్పు !
మిచౌంగ్ తుఫాన్(Michoung typhoon) చేసిన తీవ్ర నష్టాన్ని మరిచిపోక ముందే ఏపీకి(AP) మరో గండం ముంచుకొస్తోంది. ఇటీవల మిచౌంగ్ తుఫాన్ తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపింది. తాజాగా మరో తుఫాన్ దక్షిణం నుంచి బయల్దేరింది. 24 గంటల్లో అల్పడనంగా ఏర్పడ నుంది. రానున్న ఐదు రోజులపాటు కేరళ(Kerala), తమిళనాడు(Tamilnadu), పుదుచ్చేరి(Puducherry), లక్ష్యద్వీప్‌లో(Lakshadweep) భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ(IMD) తెలిపింది. ఈ అల్పపీడంన తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) కు మరో భారీ ముప్పు పొంచి ఉందా..? ఏపీకి తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉందా?.. అంటే అవుననే అంటున్నారు భారత వాతావరణశాఖ అధికారులు. మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో పంటలు దెబ్బతిని.. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరద బాధితులను ఆదుకోవడంతోపాటు..పంట నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేస్తుండగానే..తుపాన్ రూపంలో మరో గండం ముంచుకొస్తుందన్న ఐఎండీ హెచ్చరిక రైతులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది.
ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం..ఆగ్నేయ అరేబియాలో(Southeast Arabia) తుఫాన్ వాతావరణం ఉంది.
ఇది మాల్దీదీవుల(Maldives) పక్కనే ఉండటంతోపాటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. రానున్న 24గంటల్లో ఈప్రాంతంలో అల్పపీడనం ఏర్పడునున్నట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. రానున్న 5 రోజులపాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లో వర్షాలు కురుస్తాయని.. కొన్ని చోట్ల భారీ వర్షాలు(Heavy Rains) పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా కేరళపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ తుఫాన్ వాతావరణం తెలుగు రాష్ట్రాల వైపు కదులుతున్నట్టుగా ఐఎండీ వెల్లడించింది. అయితే ఇది తమిళనాడు, కేరళ, కర్నాటకను దాటుకుని రావడానికి కొంత సమయం పడుతుందని తెలిపింది. ఈ అల్పపీడనం భారీ తుఫాన్‌గా ఏర్పడే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ వైపుగా వస్తే డిసెంబర్ 21, 22, 23, 24, 25 తేదీల వరకు వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్నారు. ఈసారి తుఫాన్‌తో భారీ ముప్పు సంభవించే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రైతులు తమ పనులను డిసెంబర్ 15వ తేదీ లోపు పూర్తి చేసుకోవాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు.