దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఉష్ణోగ్రతలు (TTemperatures) ఏ మాత్రం తగ్గుముఖం పట్టలేదు.
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఉష్ణోగ్రతలు (TTemperatures) ఏ మాత్రం తగ్గుముఖం పట్టలేదు. వడగాలులు(Heat waves) భయంకరంగా వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తూ రెడ్ అలర్ట్(Red alert) జారీ చేసింది. ఇంతకు ముందు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పుడు ఎండ తీవ్రత విపరీతంగా పెరగడంతో రెడ్ అలర్ట్ జారీ చేయక తప్పలేదు. రాబోయే రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఆరు డిగ్రీలు అధికంగా అంటే 44.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. కనిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. ఈ సీజన్‌లో సగటు ఉష్ణోగ్రతల కటే 5.7 డిగ్రీలు ఎక్కువ! దీన్ని బట్టి ఢిల్లీలో వాతావరణ పరిస్థితిని ఊహించుకోవచ్చు. ఢిల్లీలో ఎనిమిది రోజులుగా వడగాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి. మధ్యాహ్నం ఎట్టిపరిస్థితుల్లోనూ ఎండలో బయటకు వెళ్లకూడదని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇంటిపట్టునే ఉంటూ మంచి నీరు తాగుతూ ఉండాలని సూచించింది. వారం రోజుల నుంచి రుతుపవనాలు ముందుకు సాగకపోవడం వల్లే వేడి వాతావరణం కొనసాగుతున్నదని వాతావరణ శాఖ తెలిపింది.