తమిళనాడులో(Tamilnadu) భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు తప్పవని భారత వాతావరణశాఖ(Indian Meteorological Department) హెచ్చరించింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో డిసెంబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ మధ్య వరకు తమిళనాడు తీర ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

Tamilnadu Weather Forecast
తమిళనాడులో(Tamilnadu) భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు తప్పవని భారత వాతావరణశాఖ(Indian Meteorological Department) హెచ్చరించింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో డిసెంబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ మధ్య వరకు తమిళనాడు తీర ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాజధాని చెన్నైతో(Chennai) పాటుగా తమిళనాడులోని మరో అయిదు జిల్లాలలో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. చెంగల్పట్టు, తిరువళ్లూరు, నాగపట్నం, రామనాథపురం, కాంచీపురం వర్ష ప్రభావిత జోన్‌లో ఉన్నట్లు పేర్కొంది.
