మహారాష్ట్రలోని నాగ్‌పుర్ (Nagpur)లో ఏకంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత(Temperature) నమోదైనట్టు వార్తలు రావడంతో జనం హడలిపోయారు. అయితే అది నిజం కాదని భారత వాతావరణశాఖ(IMD) స్పష్టం చేసింది. ఉష్ణోగ్రతను నమోదు చేసే సెన్సర్ సరిగా పనిచేయకపోవడం వల్లనే ఈ తప్పిదం జరిగిందని తెలిపింది. నాగ్‌పుర్‌లో భారత వాతావరణ విభాగం నాలుగు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ (AWS)ను ఏర్పాటుచేసింది.
మహారాష్ట్రలోని నాగ్‌పుర్ (Nagpur)లో ఏకంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత(Temperature) నమోదైనట్టు వార్తలు రావడంతో జనం హడలిపోయారు. అయితే అది నిజం కాదని భారత వాతావరణశాఖ(IMD) స్పష్టం చేసింది. ఉష్ణోగ్రతను నమోదు చేసే సెన్సర్ సరిగా పనిచేయకపోవడం వల్లనే ఈ తప్పిదం జరిగిందని తెలిపింది. నాగ్‌పుర్‌లో భారత వాతావరణ విభాగం నాలుగు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ (AWS)ను ఏర్పాటుచేసింది. వీటిలొ రెండింట అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోనేగావ్‌లో ఉన్న ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌లో 54 డిగ్రీల ఉష్ణోగ్రత, ఉత్తర అంబాజరీ రోడ్డులో ఉన్న ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌లో 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. మిగతా రెండు స్టేషన్లలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలే రికార్డయ్యాయి. దీంతో ఈ వార్త దేశమంతా వైరల్‌గా మారింది. 56 డిగ్రీల ఉష్ణోగ్రత అంటే ప్రజల మలమలమాడిపోయేవారు. అందుకే వాతావరణశాఖకు అనుమానం వచ్చి తనిఖీ చేసింది. శుక్రవారం సాయంత్రానికి అధికార ప్రకటన విడుదల చేసింది. మే 30వ తేదీన 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యిందని వస్తున్న వార్తలు నిజం కాదని, దీన్ని తాము అధికారికంగా ధ్రువీకరించట్లేదని తెలిపింది. నాగ్‌పుర్ వాతావరణ స్టేషన్‌లో ఉష్ణోగ్రతలు నమోదయ్యే సెన్సర్ సరిగా పనిచేయడం లేదని తెలిపింది. దాన్ని బాగు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.