తాను చెడ్డ నటుడినని.. బాలీవుడ్‌కి వెళ్లే ఆలోచన లేదని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ అన్నారు
తాను చెడ్డ నటుడినని.. బాలీవుడ్‌కి వెళ్లే ఆలోచన లేదని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ అన్నారు. కంగనాతో మళ్లీ సినిమా చేసే అవకాశంపై కూడా సమాధానం ఇచ్చారు. రాజకీయాల్లోకి రాకముందు చిరాగ్ సినిమాల్లోకి రావాలని ప్రయత్నించారు. 2011లో 'మిలే న మిలే హమ్' అనే చిత్రంలో ఆయన హీరోగా కూడా నటించారు. ఈ సినిమాలో ఆయన సరసన కంగనా రనౌత్ నటించింది.
ఇప్పుడు చిరాగ్ ఆ విషయమై సరదాగా స్పందిస్తూ.. ఆ సినిమాని డిజాస్టర్‌గా పేర్కొంటూ.. తాను తిరిగి బాలీవుడ్‌కి వెళ్లడం ఇష్టం లేదని చెప్పాడు. నేను నటించిన సినిమా చూసిన ఎవరైనా నాతో ఏకీభవిస్తారని నేను భావిస్తున్నాను. జీవితంలో ఏం చేయకూడదో బాలీవుడ్ నేర్పించిందని నవ్వుతూ చెప్పాడు. కంగనాతో సహా ఏ దర్శక, నిర్మాత నాతో సినిమా చేయడానికి అంగీకరించరు. మీరు కంగనా రనౌత్‌తో సినిమా చేస్తారా అడగగా.. పాశ్వాన్ బదులిస్తూ.. 'ఆమె చేయదు. నేను ఎంత మంచి నటుడనో ఆమెకు తెలుసు. నేను చాలా చెడ్డ నటుడిని.. మనతో మనం నిజాయితీగా ఉండాలన్నారు.
పెళ్లి ప్రశ్నపై బదులిస్తూ.. రాబోయే రెండేళ్ల వరకూ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని.. ముఖ్యంగా వచ్చే ఏడాది బీహార్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. నా పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయించాలనుకుంటున్నానని చెప్పారు. పెళ్లి అనేది కూడా ఒక పెద్ద బాధ్యత అని నేను భావిస్తున్నాను. నా భార్య కోసం నేను సమయం కేటాయించకపోతే బాగోదు. నా ప్రాధాన్యతల గురించి నేను చాలా స్పష్టంగా ఉన్నాను. రాజకీయం తేలికగా తీసుకోవలసిన విషయం కాదు. రాజకీయాలు పెద్ద బాధ్యతతో కూడుకున్నవని నేను భావిస్తున్నాను. నా వృత్తిని నిర్లక్ష్యంగా తీసుకోలేను. పార్లమెంటు సభ్యుడిగా, నా నియోజకవర్గంలోని 25 లక్షల మంది ప్రజలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జవాబుదారీగా ఉన్నాను. కేబినెట్ మంత్రిగా మొత్తం దేశం యొక్క బాధ్యత నాపై ఉందని అన్నారు.