కోవిడ్-19ను(Covid-19) అరికట్టేందుకు బెంగళూరు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(Bangalore Indian Institute of Science) సైంటిస్టులు కొత్త వ్యాక్సిన్‌ను(Vaccine) తయారు చేశారు. సార్స్-కోవ్-2కు చెందిన అన్ని రకాల వేరియంట్లను ఈ వ్యాక్సిన్‌ సమర్థవంతంగా నిలువరించగలదని సైంటిస్టులు చెప్తున్నారు.

కోవిడ్-19ను(Covid-19) అరికట్టేందుకు బెంగళూరు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(Bangalore Indian Institute of Science) సైంటిస్టులు కొత్త వ్యాక్సిన్‌ను(Vaccine) తయారు చేశారు. సార్స్-కోవ్-2కు చెందిన అన్ని రకాల వేరియంట్లను ఈ వ్యాక్సిన్‌ సమర్థవంతంగా నిలువరించగలదని సైంటిస్టులు చెప్తున్నారు. ఇకపై పుట్టుకొచ్చే కొత్త వేరియెంట్లపై(New Varient) పోరాడేశక్తి దీనికి ఉందని వారు అంటున్నారు. కరోనాపై పోరాటంలో ఈ వ్యాక్సిన్‌ ఒక విప్లవాత్మకమైన ముందడగు అని సైంటిస్టులు అంటున్నారు.

ప్రొ.రాఘవన్‌ వరదరాజన్(Raghavan Varadarajan) ఆధ్వర్యంలో ఐఐఎస్సీ(IISC) మాలిక్యులర్‌ బయోఫిజిక్స్‌ బృందం ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. దీనికి ఆర్.ఎస్.2(RS.2 Vaccine) టీకా అని పేరు పెట్టారు. ఈ టీకా వేడిని తట్టుకోగలదని, చల్లని ప్రదేశంలో నిల్వ చేయాల్సిన అవసరం కూడా లేదని వారు చెప్తున్నారు. కరోనా వైరస్‌కు చెందిన స్పైక్‌ ప్రొటీన్లలోని 2 కాంపోనెంట్ల సమ్మేళంతో ఆర్‌ఎస్‌2 టీకాను తయారుచేశామన్నారు. ఇందులో సింథటిక్‌ యాంటీజెన్‌ ఉంది. ప్రస్తుతం ఉన్న కరోనా టీకాల కంటే మెరుగ్గా ఆర్‌.ఎస్‌.2 వ్యాక్సిన్‌ రక్షణ ఇస్తుందని ఐఐఎస్సీ సైంటిస్టులు తెలిపారు. ఇందులోని ఎస్‌2 అనే సబ్‌ యూనిట్‌ వైరస్‌ మ్యుటేషన్లను సమర్థంగా ఎదుర్కోగలదని వారు తెలిపారు

Updated On 10 Jan 2024 11:30 PM GMT
Ehatv

Ehatv

Next Story