పేటీఎంకు దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది. ఆ కంపెనీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. లేటెస్ట్‌గా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) తరఫున టోల్‌ రుసుము వసూలు చేసే భారతీయ రహదారుల నిర్వహణ కంపెనీ (IHMCL) ఫాస్టాగ్‌(Fast tag) జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (PPBL) ను తొలగించింది.

పేటీఎంకు దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది. ఆ కంపెనీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. లేటెస్ట్‌గా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) తరఫున టోల్‌ రుసుము వసూలు చేసే భారతీయ రహదారుల నిర్వహణ కంపెనీ (IHMCL) ఫాస్టాగ్‌(Fast tag) జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (PPBL) ను తొలగించింది. తాము పేర్కొన్న బ్యాంకుల నుంచి మాత్రమే ఫాస్టాగ్‌లు కొనుగోలు చేయాలని యూజర్లకు సూచించింది. IHMCL పేర్కొన్న జాబితాలో ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యెస్‌ బ్యాంక్‌తో పాటు 32 బ్యాంకులు ఉన్నాయి. ఫిబ్రవరి 29 తర్వాత వినియోగదారుల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌ లలో డిపాజిట్లు, టాప్‌-అప్‌లు స్వీకరించొద్దని పీపీబీఎల్‌ ను రిజర్వ్‌ బ్యాంక్‌ ఇండియా ఆదేశించిన సంగతి తెలిసిందే!అయితే, ఆయా ఖాతాల్లో ఇప్పటి వరకు ఉన్న సొమ్మును మాత్రం అది అయిపోయేంత వరకు ఉపయోగించు కోవచ్చని స్పష్టం చేసింది. ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యం లోనే ఐహెచ్‌ఎంసీఎల్‌ తాజా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఫాస్టాగ్‌ యూజర్లంతా ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం తమ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ఐహెచ్‌ఎంసీఎల్‌ సూచించింది..

Updated On 16 Feb 2024 6:40 AM GMT
Ehatv

Ehatv

Next Story