తల్లి ప్రేమను కొలవడానికి ఏ కొలమానాలు లేవు! కొలిచే సాహసం కూడా ఎవరూ చేయరు. ఎందుకంటే తల్లి ప్రేమ వెలకట్టలేనిది కాబట్టి. బిడ్డ బాగోగుల కోసం తల్లి అనుక్షణం కష్టపడుతుంది. కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఆ బిడ్డే తన కళ్లముందే చనిపోతే ఏ తల్లికైనా అంతకు మించిన రంపపు కోత మరోటి ఉండదు.
తల్లి ప్రేమను కొలవడానికి ఏ కొలమానాలు లేవు! కొలిచే సాహసం కూడా ఎవరూ చేయరు. ఎందుకంటే తల్లి ప్రేమ వెలకట్టలేనిది కాబట్టి. బిడ్డ బాగోగుల కోసం తల్లి అనుక్షణం కష్టపడుతుంది. కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఆ బిడ్డే తన కళ్లముందే చనిపోతే ఏ తల్లికైనా అంతకు మించిన రంపపు కోత మరోటి ఉండదు. అలాగే ఓ ఏనుగు(Elephant) కూడా తన బిడ్డ కోసం గుండెలవిసేలా విలపించింది. పిల్ల ఏనుగును పూడ్చి పెట్టిన సమాధి(Garve) దగ్గర కన్నీళ్లు కారుస్తూ అలాగే ఉండిపోయింది తల్లి ఏనుగు. గుండెలను పిండేసే ఈ హృదయవిదారక ఘటనను ఐఎఫ్‌ఎస్(IFS) అధికారి సుశాంత నంద(Sushant Nanda) తన ఎక్స్(Twitter) అకౌంట్‌లో ట్వీట్ చేశారు. ఓ ఏనుగు పిల్ల ఏనుగుకు జన్మనించింది. ఏమైందో ఏమో కానీ కొన్ని గంటలకే ఆ పిల్ల ఏనుగు చనిపోయింది. పోస్టుమార్టం అనంతరం ఆ పిల్ల ఏనుగు మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఆ సమాధి దగ్గరకు వచ్చిన తల్లి ఏనుగు బోరున విలపించింది. కళ్ల నుంచి కన్నీళ్లు ధారగా కారాయి. ఏనుగు దు:ఖాన్ని చూసి అక్కడున్న అటవీశాఖ అధికారులు గుండెలు బరువెక్కాయి.
I had tears…
The calf of this female elephant died within hours of being born.
After post-mortem it was buried. Mother came looking for it. She will grieve for days before moving on in life.The feeling of love that a mother has towards her children is inexpressible🙏🙏 pic.twitter.com/puoJhLqY0k
— Susanta Nanda (@susantananda3) February 5, 2024