కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ(BJP) అసంతృప్త నేత జగదీశ్ శెట్టర్(Jagadish Shettar) టికెట్ కోసం అధిష్టానానికి అల్టిమేటం(Ultimatum) జారీ చేశారు. మే 10న జరగనున్న రాష్ట్ర ఎన్నికలకు(Karnataka Elections) అభ్యర్థుల మూడో జాబితాను ప్రకటించేందుకు బీజేపీకి రేపటి వరకు గడువు విధించారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ(BJP) అసంతృప్త నేత జగదీశ్ శెట్టర్(Jagadish Shettar) టికెట్ కోసం అధిష్టానానికి అల్టిమేటం(Ultimatum) జారీ చేశారు. మే 10న జరగనున్న రాష్ట్ర ఎన్నికలకు(Karnataka Elections) అభ్యర్థుల మూడో జాబితాను ప్రకటించేందుకు బీజేపీకి రేపటి వరకు గడువు విధించారు. లేదంటే మద్దతుదారులతో మాట్లాడి రేపు నిర్ణయం తీసుకుంటానని శెట్టర్ తెలిపారు.
“నేను పార్టీ నేతలను కలిసినప్పుడు వారు సానుకూలంగా స్పందించారు. సీనియర్ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నేను రేపు ఉదయం వరకు వేచి ఉంటాను. మధ్యాహ్నానికి నా శ్రేయోభిలాషులతో సమావేశం నిర్వహిస్తాను. రాష్ట్రవ్యాప్తంగా నా మద్దతుదారులు వస్తున్నారు. వాళ్లు నాతో ఉన్నారు. బీజేపీ ఇలా చేసి ఉండాల్సింది కాదని, నన్ను అవమానించారని అంటున్నారు. వారు నన్ను నిర్ణయం తీసుకోమని అడుగుతున్నారు. నాకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారుని షెట్టర్ అన్నారు.
వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్న జగదీష్ షెట్టర్‌కు.. బీజేపీ యువ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని సూచించినట్లు సమాచారం. అయితే.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప షెట్టర్‌కు 99 శాతం టిక్కెట్టు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు.
“నేను సానుకూలంగా ఆలోచించే వ్యక్తిని. ఈ క్షణం వరకు.. నాకు సానుకూల అంచనాలు ఉన్నాయి. మొన్న నేను జేపీ నడ్డాను కలిసినప్పుడు.. నేను రెండు రోజులు ఆగుతానని, అప్పటిలోగా నిర్ణయం తీసుకోమని చెప్పాను. నేను రెండు రోజులు వేచి ఉన్నాను. రేపు నా శ్రేయోభిలాషులందరూ వస్తున్నారు. సమస్యపై చర్చించి వారి అభిప్రాయం తీసుకుంటాం. ఒకవేళ బీజేపీ జాబితాను ప్రకటించకుంటే నా తదుపరి నిర్ణయం తీసుకుంటానని శెట్టర్ అన్నారు.
షెట్టర్‌కు టికెట్ ప్రకటించడంలో జాప్యాన్ని నిరసిస్తూ.. హుబ్బళ్లి ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 16 మంది బీజేపీ సభ్యులు ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ నళిన్ కుమార్ కటీల్‌కు మూకుమ్మడి రాజీనామాలు సమర్పించారు. మంగళవారం 189 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను, బుధవారం 23 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను బీజేపీ విడుదల చేయడంతో పలువురు నేతలు విస్తుపోయారు. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టికెట్‌పై ఆశలు పెట్టుకున్నప్పటికీ.. రెండు జాబితాల్లో వారి పేర్ల ప్రస్తావన రాలేదు. దీంతో మాజీ ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాడి(Lakshman Savadi)తో సహా పలువురు పార్టీకి రాజీనామా చేశారు.