సోమవారం (సెప్టెంబర్ 4) 84 సంవత్సరాలలో సెప్టెంబర్‌లో రెండవ అత్యంత వేడి రోజుగా నమోదైంది. పొడి వాతావరణం ప్రభావం వ‌ల్ల కానీ.. ఎల్ నినో సంవత్సరం ప్రభావం వ‌ల్ల కానీ ఇలాంటి ఉష్ణోగ్ర‌త‌లు(Temperatures) న‌మోద‌వుతాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ చెబుతుంది. బలమైన సూర్యకాంతి కారణంగా వర్షాకాలంలో కూడా రోజు ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. అయితే.. మంగళవారం సాయంత్రం ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

సోమవారం 84 సంవత్సరాల (1938 నుండి 2022) రికార్డుకు చేరువైంది. గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఆరు డిగ్రీలు అధికంగా 40.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. వాతావరణ శాఖ ప్రకారం.. సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 16, 1938న అత్యధికంగా 40.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం ఉష్ణోగ్రత దీని తర్వాత రెండవ అత్యధికం. కేవలం 24 గంటల్లోనే ఉష్ణోగ్రతలో మూడు డిగ్రీల పెరుగుదల కనిపించిందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 37.2 డిగ్రీలు నమోదు కాగా.. సోమవారం 40.1 డిగ్రీలకు పెరిగింది.

వాతావరణ శాఖ ప్రకారం.. రాబోయే రెండు రోజులు ఢిల్లీ వాసులు కొద్దిగా వేడిని భ‌రించ‌క త‌ప్ప‌దు. మంగళ, బుధవారాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. దీని కారణంగా.. ఉష్ణోగ్రతలో కొంత తగ్గుదల కూడా కనిపిస్తుంది. మంగళవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీలు కాగా.. బుధ, శుక్రవారాల‌లో 35 డిగ్రీల వరకూ ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేసింది.

Updated On 5 Sep 2023 5:25 AM GMT
Ehatv

Ehatv

Next Story