ఋతుపవనాలు(mansoon) ప్రస్తుతం దేశంలోని మధ్య భాగంతో పాటు ఉత్తర భారతదేశం(North India), పశ్చిమ ప్రాంతాలకు చేరుకున్నాయని వాతావరణ శాఖ ఆదివారం ప్రకటించింది. ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు చురుగ్గా ఉన్నాయని ఐఎండీ(IMD) డీజీ మృత్యుంజయ్ మహపాత్ర(DG Mrityunjay Mahapatra) తెలిపారు.
ఋతుపవనాలు(mansoon) ప్రస్తుతం దేశంలోని మధ్య భాగంతో పాటు ఉత్తర భారతదేశం(North India), పశ్చిమ ప్రాంతాలకు చేరుకున్నాయని వాతావరణ శాఖ ఆదివారం ప్రకటించింది. ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు చురుగ్గా ఉన్నాయని ఐఎండీ(IMD) డీజీ మృత్యుంజయ్ మహపాత్ర(DG Mrityunjay Mahapatra) తెలిపారు. ఋతుపవనాలు ముంబైతో(Mumbai) సహా మొత్తం మహారాష్ట్రను(Maharastra) కవర్ చేసింది. వీటితో పాటు మధ్యప్రదేశ్(Madhya Pradesh), ఉత్తరప్రదేశ్(UttarPradesh), ఢిల్లీకి కూడా రుతుపవనాలు చేరాయని పేర్కొన్నారు.
ఐఎండీ ప్రకారం.. ఋతుపవనాలు ఉత్తర భారతదేశం, పశ్చిమ భారతదేశంలోని చాలా ప్రాంతాలలో చురుకుగా ఉన్నాయి. రానున్న రెండు రోజుల్లో ఋతుపవనాలు హర్యానా(Haryana), గుజరాత్(Gujarat), పంజాబ్(Punjab), జమ్మూ ప్రాంతాలను కూడా కవర్ చేస్తుందని వెల్లడించారు. ఢిల్లీలో అత్యధికంగా 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ముంబైలో అత్యధిక వర్షపాతం (18 సెంటీమీటర్లు) తెలిపారు. ఈరోజు కూడా ముంబైలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు మధ్య భారతదేశంలో చురుకుగా ఉంటాయని వెల్లడించింది.