క్రికెట్‌(Cricket) అభిమానులు టీవీకి అతుక్కుపోయే సమయ దగ్గరపడింది. చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న దాయాదుల పోరు మరికొన్ని గంటల్లో మొదలుకానుంది. ఆసియాకప్‌-2023లో(Aisacup-2023) భాగంగా శనివారం కాండీలో భారత్‌-పాకిస్తాన్‌(India Pakistan) మ్యాచ్‌ జరుగుతుంది. ఇప్పటి వరకు ఆసియా కప్‌లో ఇండియాదే అప్పర్‌హ్యాండ్‌.

క్రికెట్‌(Cricket) అభిమానులు టీవీకి అతుక్కుపోయే సమయ దగ్గరపడింది. చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న దాయాదుల పోరు మరికొన్ని గంటల్లో మొదలుకానుంది. ఆసియాకప్‌-2023లో(Aisacup-2023) భాగంగా శనివారం కాండీలో భారత్‌-పాకిస్తాన్‌(India Pakistan) మ్యాచ్‌ జరుగుతుంది. ఇప్పటి వరకు ఆసియా కప్‌లో ఇండియాదే అప్పర్‌హ్యాండ్‌. మరోవైపు చిరకాల ప్రత్యర్థిపై గెలుపొందాలనే లక్ష్యంగా పాకిస్తాన్‌ ఉంది. పాక్‌తో పోరుకు భారత్‌ అన్ని విధాలుగా సమాయత్తమయ్యింది. తుది జట్టును కూడా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఖారారు చేసినట్టు సమాచారం. ఈ మ్యాచ్‌తో హైదరాబాద్‌ ఆటగాడు తిలక్‌వర్మ(Tilak Varma) వన్డేల్లో డెబ్యూ చేయబోతున్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌(Surya kumar Yadav) స్థానంలో తిలక్‌వర్మకు చోటు కల్పించారని తెలుస్తోంది. వెస్టిండీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన తిలక్‌వర్మ అద్భుతంగా రాణించాడు.

ఇక కేఎల్‌ రాహుల్‌(KL Rahul) కూడా పాక్‌ మ్యాచ్‌ను మిస్సవుతున్నాడు. దాంతో వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలను ఇషాన్‌ కిషన్‌కు అప్పగించబోతున్నారు. రోహిత్‌శర్మతో పాటు ఇషాన్‌ కిషన్ ఇన్నింగ్స్‌ను ఓపెన్‌ చేస్తాడని, శుభమన్‌గిల్‌ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తాడని అంటున్నారు. శ్రేయస్‌ అయ్యర్‌ రాకతో మిడిలార్డర్‌ కాసింత బలోపేతం అయ్యింది. శ్రేయర్‌ అయ్యర్‌ నాలుగో స్థానంలో కాకుండా అయిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. గిల్ మూడో స్థానంలో వస్తే, కోహ్లీ నాలుగో స్థానంలో బరిలో దిగాల్సి వస్తుంది. కాబట్టి శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ కూడా మారనుంది. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లతో బరిలో దిగాలని టీమిండియా భావిస్తున్నది.
భారత్‌ తుది జట్టు ఇలా ఉండవచ్చు : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.

Updated On 1 Sep 2023 2:27 AM GMT
Ehatv

Ehatv

Next Story