ICC New Rules : స్టంపౌట్ అప్పీళ్ల నిబంధనలను మార్చిన ఐసీసీ..!
స్టంపౌట్ అప్పీళ్లపై(Stump Out appeals) పలు రూల్స్‌ను(Rules) ఐసీసీ(ICC) సవరించింది. కొత్త రూల్స్ ప్రకారం.. స్టంపౌట్ అప్పీళ్లపై రివ్యూ కోరితే.. థర్డ్ అంపైర్ సంపౌట్‌ను మాత్రమే చెక్ చేయాల్సి ఉంటుంది. క్యాచ్ ఔట్‌ను(Catch Out) చేక్ చేయాల్సిన అవసరం లేదని నిబంధనలను మార్చింది. స్టంపౌట్‌ను స్పష్టంగా చూసే రిప్లేలను మాత్రమే చూడాల్సి ఉంటుందని.. ఈ నియమం ఇప్పటికే అమలులోకి వచ్చిందని ప్రకటించింది
స్టంపౌట్ అప్పీళ్లపై(Stump Out appeals) పలు రూల్స్‌ను(Rules) ఐసీసీ(ICC) సవరించింది. కొత్త రూల్స్ ప్రకారం.. స్టంపౌట్ అప్పీళ్లపై రివ్యూ కోరితే.. థర్డ్ అంపైర్ సంపౌట్‌ను మాత్రమే చెక్ చేయాల్సి ఉంటుంది. క్యాచ్ ఔట్‌ను(Catch Out) చేక్ చేయాల్సిన అవసరం లేదని నిబంధనలను మార్చింది. స్టంపౌట్‌ను స్పష్టంగా చూసే రిప్లేలను మాత్రమే చూడాల్సి ఉంటుందని.. ఈ నియమం ఇప్పటికే అమలులోకి వచ్చిందని ప్రకటించింది. గతంలో స్టంపౌట్ అప్పీల్ చేస్తే స్టంపౌట్‌తో పాటు బంతి బ్యాట్‌కు తాకిందా లేదా అన్న దానిని థర్డ్ అంపైర్ పరిశీలించేవారు. స్టంపౌట్‌పై అప్పీల్‌కు వెళ్తే.. బంతి బ్యాట్‌కు తగిలిందా లేదా అని చూసేవారు. ఒకవేళ బంతి బ్యాట్‌కు తగిలి కీపర్(Keeper) దానిని పట్టుకుంటే క్యాచౌట్‌గా ప్రకటించేవారు. ఇది బౌలింగ్ చేసే జట్టుకు అనుకూలంగా ఉంటుంది. స్టంపౌట్ అప్పీల్‌కు వెళ్తే.. రెండు రకాల ప్రయోజనాలుండేవి ఒకటి క్యాచ్ ఔట్ లేదా స్టంపౌట్ ఎదో ఒక ప్రయోజనం రాకపోదా అని బౌలింగ్ జట్టు దీనిని ఆసరాగా తీసుకునేది. తాజా నిర్ణయంతో ఇకపై ఈ ఆప్షన్స్ ఉండవు. ఇక మరో కంకషన్ సబ్‌స్టిట్యూట్ విషయంలో ఐసీసీ స్పష్టతనిచ్చింది. కంకషన్‌కు గురైన ప్లేయర్‌పై బౌలింగ్ నిషేధం ఉంటే అతని స్థానంలో వచ్చే సబ్‌స్టిట్యూట్‌ను బౌలింగ్‌కు అనుమతించరని ఐసీసీ స్పష్టం చేసింది.