వన్డే వరల్డ్‌కప్‌లో(one day World Cup) పేలవమైన ప్రదర్శనను కనబర్చిన శ్రీలంక టీమ్ (Sri Lanka team )లీగ్‌ దశలోనే నిష్క్రమించింది. ఫలితంగా శ్రీలంక క్రికెట్‌ బోర్డును ఆ దేశ క్రీడా మంత్రి రోషన్‌ రణసింఘే (Roshan Ranasinghe) రద్దు చేశాడు

క్రికెట్‌ బోర్డు అంతర్గత వ్యవహారాలలో ప్రభుత్వ జోక్యాన్ని తీవ్రంగా పరిగణించిన అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ICC) శ్రీలంక బోర్డుపై సస్పెన్షన్‌ వేటు వేసింది.. ఇది పాత విషయమే కానీ, ఇప్పుడు శ్రీలంకకు ఐసీసీ మరో షాకిచ్చింది. శ్రీలంక బోర్డుపై నిషేధం కారణంగా అక్కడ జరగాల్సిన క్రికెట్‌ ఈవెంట్‌ను (cricket event)ఐసీసీ మరో దేశానికి మార్చింది. నిజానికి వచ్చే ఏడాది జనవరిలో అక్కడ అండర్‌-19 పురుషుల ప్రపంచకప్‌ టోర్నమెంట్ (under 19 men world cup )జరగాల్సి ఉంది. ఇప్పుడా టోర్నమెంట్‌ను దక్షిణాఫ్రికాకు (south Africa)మార్చింది ఐసీసీ. అహ్మదాబాద్‌లో నవంబర్‌ 21వ తేదీన జరిగిన బోర్డు సమావేశంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో (2020) సౌతాఫ్రికా అండర్‌–19 వరల్డ్‌కప్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు మరోసారి ఆ దేశానికి అవకాశం ఇచ్చినట్లు ఐసీసీ సభ్యుడు తెలిపాడు. వేదిక మార్పు అంశాన్ని టోర్నీలో పాల్గొనే జట్లకు ఇదివరకే తెలియజేశామన్నాడు.

Updated On 21 Nov 2023 10:50 PM GMT
Ehatv

Ehatv

Next Story