మహిళలు ఎంత పెద్ద హోదాలో ఉన్నా వారిలో అమ్మ మనసు అప్పుడప్పుడు బయటకు వస్తుంటుంది.
మహిళలు ఎంత పెద్ద హోదాలో ఉన్నా వారిలో అమ్మ మనసు అప్పుడప్పుడు బయటకు వస్తుంటుంది. మరీ ముఖ్యంగా పోలీసు(Police) ఉద్యోగాల్లో ఉన్న మహిళలు కాఠిన్యాన్ని ప్రదర్శిస్తూనే చల్లటి మనసును చాటుకుంటుంటారు. ఇలాంటి ఘటనే కర్నాకటలో(Karnataka) చోటు చేసుకుంది. బాగల్ కోట్ పట్టణంలో ఓ మహిళా ఎస్‌ఐ(IAS) విధులు నిర్వహిస్తున్నారు. రోడ్డుపై వెళుతున్న వాహనాలను ఆపి చెక్ చేస్తున్నారు. ఇంతలో ఓ టూ వీలర్‌పై ముగ్గురు విద్యార్థులు రావడాన్ని గమనించి వారిని ఆపారు. ముగ్గురులో ఎవరికీ హెల్మెట్ లేదు. పైగా ట్రిపుల్ రైడింగ్. వారికి ఫైన్ వేశారు. ఆ ముగ్గురిలో ఓ కుర్రాడు తన దగ్గర మాత్రమే డబ్బులు ఉన్నాయని, వాటిని కూడా కాలేజీలో ఫీజు కట్టేందుకు తీసుకెళుతున్నానని చెబుతూ కంటతడి పెట్టాడు. అది చూసిన ఆ మహిళా ఎస్ఐలో అమ్మతనం బయటకు వచ్చింది. ఏడుస్తున్న ఆ కుర్రాడిని అక్కున చేర్చుకుని ఓదార్చింది. ఆ పిల్లోడి కళ్లు తుడిచి తన దగ్గర ఉన్న డబ్బులో కొంత తీసి విద్యార్థికి ఇచ్చింది. అతడు వద్దంటున్నా జేబులో పెట్టింది. తర్వాత వారిని హెచ్చరించి, జాగ్రత్తగా వెళ్లండి అని చెప్పి పంపించారు. ఈ ఘటనను అక్కడే ఉన్న వ్యక్తులు తమ మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఆ ఎస్‌ఐను తెగ మెచ్చుకుంటున్నారు. ఆమెకు జేజేలు పలుకుతున్నారు.