మణిపూర్ హింస విషయమై పార్లమెంటులో ప్రతిష్టంభన నేపథ్యంలో ప్రతిపక్షాలు బుధవారం మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తీసుకురాబోతున్నాయి. లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మంగళవారం రాత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. ఉదయం 10 గంటలకు లోక్‌సభ స్పీకర్‌కు నోటీసు అందజేస్తామని తెలిపారు.

I.N.D.I.A Parties Discuss Proposal To Move No-Confidence Motion Against Govt
మణిపూర్ హింస(Manipur Violence) విషయమై పార్లమెంటు(Parliament)లో ప్రతిష్టంభన నేపథ్యంలో ప్రతిపక్షాలు బుధవారం మోదీ ప్రభుత్వం(Modi Govt)పై అవిశ్వాస తీర్మానం తీసుకురాబోతున్నాయి. లోక్‌సభ(Loksabha)లో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి(Adhir Ranjan Chowdhury)మంగళవారం రాత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. ఉదయం 10 గంటలకు లోక్‌సభ స్పీకర్(Loksabha Speaker)కు నోటీసు అందజేస్తామని తెలిపారు. కాగా, ఎంపీలకు పార్టీ విప్ జారీ చేసింది. ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉంది. అటువంటి పరిస్థితిలో అవిశ్వాస తీర్మానానికి అర్థం ఉండదు. అయితే ఈ తీర్మానం ద్వారా.. ప్రధాని(Prime Minister) ప్రకటనకై డిమాండ్ నెరవేరుతుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.
ప్రధాని సభలో ప్రకటన చేసిన తర్వాతే మణిపూర్‌పై చర్చను ప్రారంభించాలన్న తమ వైఖరికి తాము కట్టుబడి ఉన్నామని ప్రతిపక్ష కూటమి 'I-N-D-I-A'లోని పార్టీలు స్పష్టం చేశాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే(Mallikarjuna Kharge) నేతృత్వంలో మంగళవారం ఉదయం పార్లమెంట్ హౌస్‌లో జరిగిన 'I-N-D-I-A' నేతల సమావేశంలో అవిశ్వాస తీర్మానం(No Confidence Motion)పై చర్చించినట్లు వర్గాలు తెలిపాయి.
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి(Prahlad Joshi)మాట్లాడుతూ.. అవిశ్వాస తీర్మానం పెట్టడం విపక్షాలకు తెలియదని అన్నారు. చివరిసారి అవిశ్వాస తీర్మానం పెడితే.. బీజేపీ(BJP) 300కు పైగా మెజారిటీతో ఓడిందని తెలుసుకోవాలని.. ఈసారి అవిశ్వాస తీర్మానం పెడితే 350కి పైగా సభ్యుల మద్దతు ఉంటుందని అన్నారు.
17వ లోక్‌సభలో ఇప్పటి వరకు మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం రాలేదు. లోక్‌సభలో ఏ ఎంపీ అయినా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. తీర్మానం జాబితా చేయబడిన తర్వాత.. లోక్‌సభ స్పీకర్ దానిని సభ లోపల ప్రకటిస్తారు. అదే సమయంలో కనీసం 50 మంది ఎంపీలు తీర్మానానికి మద్దతుగా తల వూపవలసి ఉంటుంది.
సభలో తీర్మానం ఆమోదం పొందితే.. అవిశ్వాస తీర్మానంపై చర్చతోపాటు ఓటింగ్ తేదీని స్పీకర్ ప్రకటిస్తారు. నిబంధనల ప్రకారం.. అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించిన రోజు నుండి 10 రోజులలోపు ఓటింగ్ నిర్వహించాల్సివుంటుంది. లోక్‌సభలోని 543 స్థానాలకు గాను.. ప్రస్తుతం ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
లోక్‌సభలో ఎన్‌డీఏ(NDA)కు 330 మందికి పైగా సభ్యులు ఉండగా.. మెజారిటీ మార్క్ 272. కాగా 'I-N-D-I-A'లో ఉన్న పార్టీలకు దాదాపు 150 మంది ఎంపీలు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్(YSRCP), బీజేడీ(BJD), బీఆర్ఎస్(BRS) పార్టీలకు 60 మందికి పైగా ఎంపీలు ఉన్నారు. ప్రస్తుతానికి వారు ఈ రెండు శిబిరాలకు దూరంగా ఉన్నారు. ఈ మూడు పార్టీలు ఏదో ఒక వర్గానికి దగ్గరైతే మాత్రం లెక్కలు మారుతాయి.
