కర్ణాటక తదుపరి సీఎం ఎవరన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య తదుపరి ముఖ్యమంత్రి రేసులో ముందున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కొత్త సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సిద్ధరామయ్య సోమవారం ఢిల్లీ చేరుకున్నారు.

కర్ణాటక తదుపరి సీఎం(Karnataka CM) ఎవరన్నదానిపై సస్పెన్స్(Suspence) కొనసాగుతోంది. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shiva Kumar), మాజీ సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah) తదుపరి ముఖ్యమంత్రి రేసులో ముందున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు(Karnataka Election Results) వెలువడిన తర్వాత కొత్త సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సిద్ధరామయ్య సోమవారం ఢిల్లీ చేరుకున్నారు. డీకే శివకుమార్ కూడా ఇవాళ ఢిల్లీ(Delhi)కి చేరుకుంటున్నారు. ఢిల్లీకి వెళ్లే ముందు డీకే శివకుమార్ మాట్లాడుతూ.. పార్టీ తల్లిలాంటిదని, పార్టీ హైకమాండ్‌(High Commond)ని కలుస్తానని, అమ్మ(Mother) మనకు ఏది కావాలంటే అది ఇస్తుందని అన్నారు.

అయితే ఆరోగ్య కారణాలతో శివకుమార్ నిన్న‌ ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యను మొదటి ఎంపికగా పేర్కొన్నారని, అయితే శివకుమార్ కూడా సీఎం ప‌ద‌విని వదులుకోవడానికి సిద్ధంగా లేరని చెబుతున్నారు.

ఎమ్మెల్యేలంతా కలిసి ఉన్నారని శివకుమార్ అన్నారు. ముఖ్యమంత్రి పేరుపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోనుంది. 'సీఎం పేరుపై నేను వ్యాఖ్యానించదలుచుకోలేదు. నేను చెప్పాలనుకున్నది ముందే చెప్పాను. ఎమ్మెల్యేల మద్దతు నాకు అవసరం లేదు. అది నాకు ముఖ్యం కాదు. అందరం ఒక్కటే, కలిసి పని చేస్తామ‌న్నారు.

గత రెండు రోజులుగా కర్ణాటక సీఎం పేరుపై ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి నేడు మరోసారి సమావేశం జరగనుంది. సీఎం పేరుపై మంగళవారం మరోసారి సమావేశం కానున్నట్లు ప‌రిశీల‌కులు సుశీల్‌కుమార్‌ షిండే(Susheel Kumar Shinde) తెలిపారు. పరిశీలకులు తమ నివేదికను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సమర్పించారు. ఈ రోజు సాయంత్రం దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఆదివారం బెంగళూరు(Bengaluru)లో పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌(KC Venugopal), కేంద్ర పరిశీలకుల సమక్షంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఇందులో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం ద్వారా శాసనసభా పక్ష నేతను ఎన్నుకునే హక్కు పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గేకు క‌ల్పించారు. ఈరోజు లేదా రేపు సీఎం పేరు ప్రకటించే అవకాశం ఉంది. గురువారం ప్రమాణస్వీకారోత్సవం జరిగే అవకాశం ఉంది.

Updated On 15 May 2023 10:38 PM GMT
Yagnik

Yagnik

Next Story