ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లిన ఓ తెలంగాణ యువతి ప్రస్తుతం దీన స్థితిలో ఉన్నారు. మాస్టర్స్‌(Masters) చేయాలని హైదరాబాద్‌ నుంచి వెళ్లిన ఆ యువతి షికాగో(Chicago) రోడ్లపై ఆకలితో అలమటిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆమె తల్లి తన కూతురును భారత్‌కు తీసుకురావాలని వేడుకుంటూ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు(Jaishankar) లేఖ రాశారు.

ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లిన ఓ తెలంగాణ యువతి ప్రస్తుతం దీన స్థితిలో ఉన్నారు. మాస్టర్స్‌(Masters) చేయాలని హైదరాబాద్‌ నుంచి వెళ్లిన ఆ యువతి షికాగో(Chicago) రోడ్లపై ఆకలితో అలమటిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆమె తల్లి తన కూతురును భారత్‌కు తీసుకురావాలని వేడుకుంటూ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు(Jaishankar) లేఖ రాశారు. ఈ లేఖను బీఆర్‌ఎస్‌(BRS) నేత ఖలీకర్‌ రెహమాన్‌(Khalekar Rahman) తన ట్విట్టర్‌ కాతాలో పోస్ట్ చేశారు. మౌలాలికి చెందిన సయ్యదా లులు మిన్హాజ్‌ జైదీ అనే యువతి మాస్టర్స్‌ చేయడానికి 2021 ఆగస్టులో అమెరికాకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన ఆమె తరచూ తల్లి సయ్యదా వహాజ్‌ ఫాతిమాతో ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేవారు. ఏమైందో ఏమో కానీ రెండు నెలలుగా కూతురు నుంచి తల్లికి ఎలాంటి ఫోన్‌ రావడం లేదు. హైదరాబాద్‌ నుంచి అమెరికాకు వెళ్లిన కొందరు ఆమెను గుర్తుపట్టి తల్లికి చెప్పారు. ఆమె వస్తువులను ఎవరో దొంగలించారని, దీంతో షికాగో రోడ్లపై ఆకలితో అలమటిస్తున్నారని తెలిపారు. అంతే కాకుండా సయ్యదా లులు మిన్హాజ్‌ జైదీ మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్టు పేర్కొన్నారు. కూతురు పరిస్థితి తెలుసుకుని తల్లి తల్లడిల్లిపోయారు. తన కూతురును తిరిగి స్వదేశానికి తీసుకురావాలని కేంద్రమంత్రిని అభ్యర్థించారు. ఈ మేరకు ఒక లేఖ రాశారు. ‘‘నా కూతురు సయ్యదా లులు మిన్హాజ్ జైదీ మాస్టర్స్‌ చేయడానికి అమెరికాకు వెళ్లింది. రెండు నెలలుగా ఆమె నాకు ఫోన్‌ చేయడం లేదు. హైదరాబాద్‌ నుంచి మాకు తెలిసిన కొందరు అమెరికాకు వెళ్లారు. చికాగోలో నా కుమార్తెను గుర్తించారు. ఆమె వస్తువులు చోరీకి గురయ్యాయి. ఆకలితో అలమటిస్తోంది. ఆమెను భారత్‌కు తీసుకురావాలని కోరుతున్నాను’’ అని లేఖలో పేర్కొంది.

Updated On 26 July 2023 5:47 AM GMT
Ehatv

Ehatv

Next Story