ఓ జంటకు ఏడాదిన్నరకిందటే వివాహం జరిగింది. ఎన్నో ఆశలతో మహోన్నత వివాహ బంధంలోకి భార్యాభర్తలు అడుగుపెట్టారు. పెళ్లయిన నాటి నుంచి అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఇద్దరు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కానీ విధి ఆడిన వింత నాటకంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. భర్త కళ్ల ఎదుటే భార్య పైలోకాలకు వెళ్లిపోయింది. ఈ విషాదంపై వివరాల్లోకి వెళ్తే..!

జహీరాబాద్‌కు(Zaheerabad) చెందిన సాయి మోహన్‌, నవ్య(26) దంపతులు చండీగఢ్‌లో(Chandigarh) నివసిస్తున్నారు. ఈ జంట విహారయాత్ర(Vaccation) కోసం హిమాచల్‌ప్రదేశ్‌(Himachal Pradesh) వెళ్లింది. అక్కడ పారాగ్లైడింగ్(Paragliding) చేస్తూ ప్రమాదవశాత్తు నవ్య ప్రాణాలు కోల్పోయింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూలో నవ్య పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. భర్త కళ్లెదుట ఆమె ప్రాణాలు కోల్పోయింది. నవ్య పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో పైలట్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తేలింది. సీట్ బెల్ట్‌ను(Seat belt) నవ్యకు సరిగ్గా అమర్చకపోవడంతో ప్రమాదవశాత్తు జారిపడి చనిపోయింది. అయితే ఈ ఘటనలో నవ్యతో పాటు పారాగ్లైడింగ్‌ చేయించిన పైలట్‌(Pilot) ప్రాణాలతో బయటపడ్డాడు. మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని అక్కడి పర్యాటక అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై బాధిత కుటుంబాలకు సమాచారం అందించారు. నిర్లక్ష్యం, భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పైలట్‌ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు. నవ్య మృతితో కుటుంబంలో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పారాగ్లైడింగ్ సమయంలో వీడియో కాల్ మాట్లాడారని.. ఆ తర్వాత కాసేపటికే ఈ ఘోరం జరిగిపోయిందని కుటుంబసభ్యులు విలపిస్తున్నారు.

Updated On 13 Feb 2024 2:00 AM GMT
Ehatv

Ehatv

Next Story