హైదరాబాద్‌లోని విద్యానగర్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో బాలిక, యువతిపై కత్తితో దాడికి పాల్పడిన బాలుడిగా పోలీసులు గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Vidyanagar Railway station
హైదరాబాద్‌లోని(Hyderabad) విద్యానగర్ రైల్వేస్టేషన్(Vidyanagar Railway station) సమీపంలో రైలు కింద పడి ఓ బాలుడు ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. మృతుడు అంబర్‌పేట పోలీస్‌స్టేషన్(Amberpet Police station) పరిధిలో బాలిక, యువతిపై కత్తితో దాడికి పాల్పడిన బాలుడిగా పోలీసులు గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రేమ పేరుతో(Love) బాలికను గత కొంతకాలంగా ఈ బాలుడు వెంటపడి వేధిస్తున్నాడు. ఫోన్‌లో మెసేజ్‌లు పెడుతున్నాడు. బాగ్ అంబర్‌పేట తురాబ్‌నగర్‌లో ఉండే బాలిక, బాలుడు ఒకే స్కూల్‌లో పదో తరగతి వరకు కలిసి చదవుకున్నారు. బాలిక తల్లి స్థానికంగా టైలరింగ్ పని చేసేది. ఇటీవలే ఆమె అనారోగ్యంతో చనిపోయింది. టైలరింగ్ సామగ్రిని బాలుడి కుటుంబీకులు కొన్నారు. తన పెద్దమ్మ కూతురు దగ్గరకు బాలిక ట్యూషన్‌కు వెళుతుండేది. గురువారం సాయత్రం కూడా ట్యూషన్‌కు వెళ్లిందా బాలిక. ఆ సమయంలో వెంటపడి వెకిలిచేష్టలకు పాల్పడ్డాడు. రాత్రి ఏడున్నర గంటల సమయంలో ట్యూషన్‌కు వెళ్లి బాలికను కత్తితో పొడిచాడు. అడ్డువచ్చిన ఆమె పెద్దమ్మ కూతురును కూడా పొడిచి కత్తిని అక్కడే పారేసి పారిపోయాడు. గాయపడ్డ వారిని హాస్పిటల్‌లో చేర్పించారు. తర్వాత బాలుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
