అయోధ్యలో(Ayodhya) రామమందిరం(Ram mandir) ప్రారంభోత్సవం మరో రెండు రోజుల్లో జరగనుంది. దేశంలో ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా ఆలయం కోసం పాటుపడుతున్నారు. హైదరాబాద్‌కు(Hyderabad) చెందిన రామభక్తులు కూడా రాముడిపై తమ భక్తిని, ప్రేమను చాటుకున్నారు. నగరంలోని శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీసెస్(Sri Ram Catering Service) యజమాని ఎన్.
అయోధ్యలో(Ayodhya) రామమందిరం(Ram mandir) ప్రారంభోత్సవం మరో రెండు రోజుల్లో జరగనుంది. దేశంలో ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా ఆలయం కోసం పాటుపడుతున్నారు. హైదరాబాద్‌కు(Hyderabad) చెందిన రామభక్తులు కూడా రాముడిపై తమ భక్తిని, ప్రేమను చాటుకున్నారు. నగరంలోని శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీసెస్(Sri Ram Catering Service) యజమాని ఎన్. నాగభూషణం రెడ్డి(Nagabhushanam Reddy) తయారు చేసిన భారీ లడ్డూ(Laddu) శనివారం ఉదయం అయోధ్యకు చేరుకుంది. సుమారు 1,265 కిలోల బరువు ఉన్న ఆ లడ్డూ కరసేవక్‌పురానికి చేరుకున్నట్టు ఆయన చెప్పారు.
క్యాటరింగ్ వ్యాపారంపై, తన కుటుంబంపై రాముడి ఆశీస్సులు ఉన్నాయని, బ్రతికి ఉన్నంత కాలం రాముడి కోసం ప్రతి రోజు ఒక కిలో లడ్డూ తయారు చేయాలని కోరుకున్నానని నాగభూషణం తెలిపారు. అయోధ్యకు తీసుకువెళ్లిన లడ్డూకు సంబంధించిన ఫుడ్ సర్టిఫికేట్‌ను కూడా తీసుకువచ్చినట్లు చెప్పారు. తాము తయారు చేసిన లడ్డూలు నెల రోజులు వరకు పాడవకుండా ఉంటాయన్నారు. మూడు రోజుల పాటు 25 మంది ఆ అఖండ లడ్డూను తయారు చేసినట్లు తెలిపారు. ఈనెల 17వ తేదీన హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో బయలుదేరినట్లు ఆయన చెప్పారు. అఖండ లడ్డూను హైదరాబాద్ నుంచి అయోధ్యకు తీసుకెళ్లడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. వాహనానికి ప్రత్యేక సస్పెన్షన్ చేయించినట్టు చెప్పారు. గ్లాసు, ఏసీ కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు. 350 కిలోల శనగపిండి, 700 కిలోల చక్కర, 40 కిలోల జీడిపప్పు, 25 కిలోల బాదాం, నాలుగు కిలోల కిస్‌మిస్, 40 కిలోల నెయ్యి, 15 కిలోల నూనె, కుంకుమ పువ్వు, పచ్చ కర్పూరంతో లడ్డూను తయారు చేసినట్లు ఆయన తెలిపారు.