హైదరాబాద్‌కు(Hyderabad) చెందిన ఎస్‌.కె. అష్రఫ్‌(SK Ashraf) అత్యంత వేగంగా ఆంగ్ల అక్షరమాల(Alphabets) వెనుకకు టైప్ చేసిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డు(Guinness record) సృష్టించాడు. అష్రఫ్ అసాధారణ రికార్డు సృష్టించిన వీడియో సోషల్ మీడియాలో షేర్‌ చేశారు, అతను కంప్యూటర్‌లో ఆంగ్ల అక్షరాలను వెనుకకు టైప్ చేశాడు.

హైదరాబాద్‌కు(Hyderabad) చెందిన ఎస్‌.కె. అష్రఫ్‌(SK Ashraf) అత్యంత వేగంగా ఆంగ్ల అక్షరమాల(Alphabets) వెనుకకు టైప్ చేసిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డు(Guinness record) సృష్టించాడు. అష్రఫ్ అసాధారణ రికార్డు సృష్టించిన వీడియో సోషల్ మీడియాలో షేర్‌ చేశారు, అతను కంప్యూటర్‌లో ఆంగ్ల అక్షరాలను వెనుకకు టైప్ చేశాడు. ఇదే విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ (GWR) వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కేవలం 2.88 సెకన్లలో రెప్ప పాటులో ఆంగ్ల ఆక్షరాలను వెనక్కి టైప్‌ చేశాడు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది అష్రఫ్‌.. ఫిబ్రవరి 5న ఈ రికార్డ్‌ సెట్‌ చేశాడు. ఈ వీడియోకు 1.1 మిలియన్ కంటే ఎక్కువగా వ్యూస్‌ వచ్చాయి. అంతేకాకుండా 50 వేల లైక్‌లు కూడా పొందింది. ఇక ఈ వీడియో చూసినవారు పలు రకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. రాకెట్ కంటే వేవంగా మీ టైపింగ్‌ ఉందని మెచ్చుకున్నారు. అయితే అష్రఫ్ గతంలోనూ ఆల్ఫాబెట్‌లను స్పీడ్‌గా టైప్ చేసి కూడా రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు 2.88 సెకన్లలోనే ఇంగ్లిష్ ఆల్ఫాబెట్‌లను రివర్స్‌లో టైప్‌ చేసి మరోసారి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు.

Updated On 4 May 2024 12:40 AM GMT
Ehatv

Ehatv

Next Story