ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Case) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్, మనీలాండరింగ్ కేసులో(Money laundering) అరెస్టయిన హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైకి(Ramachandran Pillai) బెయిల్(Bail) మంజూరు అయ్యింది. ఈ కేసులో కీలక నిందితుడు అరుణ రామచంద్రన్ పిళ్ళై కి ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగ్ పాల్(Nag Paul) మధ్యంతర బెయిల్(Interim Bail) మంజూరు చేసింది.

Ramachandran Pillai
ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Case) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్, మనీలాండరింగ్ కేసులో(Money laundering) అరెస్టయిన హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైకి(Ramachandran Pillai) బెయిల్(Bail) మంజూరు అయ్యింది. ఈ కేసులో కీలక నిందితుడు అరుణ రామచంద్రన్ పిళ్ళై కి ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగ్ పాల్(Nag Paul) మధ్యంతర బెయిల్(Interim Bail) మంజూరు చేసింది. భార్య అనారోగ్య కారణంగా పిళ్ళైకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్టు కోర్టు తెలిపింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) బినామీగా అరుణ్ రామచంద్రన్ పిళ్ళైపై దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. పిళ్ళై అప్రూవర్‌గా మారారని జరిగిన ప్రచారాన్ని..ఆయన తరపు న్యాయవాది ఖండించారు. గతంలోనే అప్రూవర్‌గా శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ మారిన విషయం తెలిసిందే. ఆరు నెలల్లోపు ఈ కేసు దర్యాప్తును పూర్తి చేయాలని ఈడీని సుప్రీంకోర్టు(supreme court) ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోచార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ఈడీ ప్రయత్నాలు చేస్తోంది. త్వరలోనే ఢిల్లీ లిక్కర్ కేసు తెరపైకి రానుంది. మరొకసారి ఈ కేసులో లింకు ఉన్న పలువురిని ప్రశ్నించేందుకు నోటీసులు జారీ చేసే యోచనలో ఈడీ వర్గాలు ఉన్నట్టు తెలుస్తోంది.
