ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) ఓ నీచ్ కమీనే కుత్తే లాంటి ఓ భర్త బాగోతం వెలుగులోకి వచ్చింది. భార్యను హనీమూన్‌కు(Honey moon) తీసుకెళ్లడానికి అత్తంటివారిని పది లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. తమ దగ్గర అంత డబ్బు లేకపోయినా అప్పోసస్పో చేసి అయిదు లక్షల రూపాయలు అల్లుడికి ఇచ్చారు. ఈ అమౌంటే వాడికి ఎక్కువ.
ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) ఓ నీచ్ కమీనే కుత్తే లాంటి ఓ భర్త బాగోతం వెలుగులోకి వచ్చింది. భార్యను హనీమూన్‌కు(Honey moon) తీసుకెళ్లడానికి అత్తంటివారిని పది లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. తమ దగ్గర అంత డబ్బు లేకపోయినా అప్పోసస్పో చేసి అయిదు లక్షల రూపాయలు అల్లుడికి ఇచ్చారు. ఈ అమౌంటే వాడికి ఎక్కువ. అక్కడితో సంతృప్తి చెందితే వాడు మంచి భర్త ఎలా అవుతాడు? హనీమూన్‌లో నీచానికి పాల్పడ్డాడు. భార్య అసభ్యకర వీడియోలు తీశాడు. వాటిని అత్తింటివారికి పంపాడు. మరో అయిదు లక్షల రూపాయలు పంపకుంటే ఈ వీడియోలను వైరల్ చేస్తానంటూ బెదిరించాడు.
ఉత్తరప్రదేశ్‌లోని పిలిబిత్‌కు చెందిన యువతికి బుదౌన్‌లోని బిసౌలీ ప్రాంతానికి చెందిన వ్యక్తితో ఫిబ్రవరిలో పెళ్లి జరిగింది. పెళ్లి అయితే అయ్యింది కానీ ఫస్ట్ నైట్ కాలేదు. మూడు నెలలుగా ఇదిగో అదిగో అంటూ తప్పించుకుంటున్నాడు మొగుడు. భర్త ప్రవర్తనపై భార్యకు డౌటొచ్చింది. తన అత్తతో అంటే భర్త తల్లితో విషయం చెప్పుకుని బాధపడింది. కొడుకుకు నచ్చచెప్పాల్సిన ఆమె కూడా పట్టించుకోలేదు. దీంతో తనతో ఎందుకు దూరంగా ఉంటున్నావని నేరుగా భర్తనే అడిగింది. తనకు పది లక్షల రూపాయలు అదనంగా ఇవ్వాలని అత్తింటివారిని డిమాండ్ చేశాడు. అలాగైతేనే భార్యను హనీమూన్‌కు తీసుకెళతానన్నాడు. కూతురు కాపురం బాగుండాలన్న ఉద్దేశంతో అమ్మాయి తల్లిదండ్రులు అల్లుడికి అయిదు లక్షలు ఇచ్చారు.
డబ్బు రాగానే వాడు భార్యను తీసుకుని నైనిటాల్‌కు హనీమూన్‌కు వెళ్లాడు. అక్కడ భార్య అశ్లీల వీడియోలు తీశాడు. మరో అయిదు లక్షలు ఇవ్వకుంటే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తానని బెదిరించాడు. వాడి వికృత చేష్టలను తట్టుకోలేక భార్య పుట్టింటికి వచ్చింది. తల్లిదండ్రులకు విషయం చెప్పుకుని బోరుమంది. తర్వాత ధైర్యం తెచ్చుకుని కొత్వాల్ పోలీస్ స్టేషన్‌లో భర్త, అత్తపై కేసు పెట్టింది. ఇప్పటికే పెళ్లికి 20 లక్షల రూపాయలు ఖర్చు చేశామని, కూతురు అత్తమామలకు, ఆడపడుచులకు మరో 15 లక్షల రూపాయల విలువైన నగలు కానుకగా ఇచ్చామని అమ్మాయి తల్లిదండ్రులు చెప్పారు.