మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) బేతుల్(Bethul) జిల్లాకు చెందిన శివరామ్ రాథోడ్(Shiva ram Rathore) (35) మూడేళ్ల కిందట పూజ(Pooja) అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. శివరామ్ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. పూజకు గుట్కా(Tobacco) నమిలే అలవాటు ఉంది. ఆ అలవాటుకొద్దీ ఆదివారం రాత్రి పొరుగింటి వ్యక్తి దగ్గర గుట్కా అడిగి తీసుకుంది.

Madhya Pradesh Crime
మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) బేతుల్(Bethul) జిల్లాకు చెందిన శివరామ్ రాథోడ్(Shiva ram Rathore) (35) మూడేళ్ల కిందట పూజ(Pooja) అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. శివరామ్ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. పూజకు గుట్కా(Tobacco) నమిలే అలవాటు ఉంది. ఆ అలవాటుకొద్దీ ఆదివారం రాత్రి పొరుగింటి వ్యక్తి దగ్గర గుట్కా అడిగి తీసుకుంది. ఈ విషయం శివరామ్‌కు తెలిసింది. గుట్కా కావాలంటే తనను అడగవచ్చు కదా? అంటూ పూజను నిలదీశాడు శివరామ్. ఈ క్రమంలో ఇద్దరిమధ్య గొడవ మొదలయ్యింది. తర్వాత శివరామ్ బయటకు వెళ్లాడు. మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. మళ్లీ భార్యతో గొడవపడ్డాడు. ఇద్దరూ తీవ్ర స్థాయిలో తిట్టుకున్నారు. అప్పటికీ శివరామ్ తగ్గకపోవడంతో సమీపంలో ఉన్న తన సోదరుడికి పూజ సమాచారం అందించింది. పూజ సోదరుడు అక్కడికి వచ్చాడు. పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు చేరుకునేలోపే శివరామ్ బ్లేడ్‌తో గొంతు, మణికట్టు కోసుకున్నాడు. తీవ్రరక్తస్రావంతో బాధపడుతున్నశివరామ్‌ను పోలీసులు బేతుల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే మద్యం మత్తులో శివరామే గొంతు కోసుకున్నాడా? లేకపోతే ఎవరైనా ఆ పని చేశారా ? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
