తమిళనాడు(Tamil Nadu)లోని సేలం కోర్టులో ఓ విచిత్రం జరిగింది. విడాకులు ఇచ్చేసిన తర్వాత కూడా భార్యను చిత్రవిచిత్ర రీతిలో అవమానించాడు ఓ భర్త. విడాకులు ఇచ్చిన భార్యకు ఇవ్వాల్సిన భరణాన్ని చిల్లర నాణేలుగా ఇచ్చాడు. సేలం జిల్లాలో కిడయూరు మెట్టూరు(Mettur)కు చెందిన 57 ఏళ్ల రాజీ ఓ ప్రైవేటు కంపెనీలు క్యాషియర్. ఈయన భార్య శాంతి.. వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. విడిపోవడమే బెటరనుకున్నారు. విడాకులు తీసుకుని విడివిడిగా జీవిస్తున్నారు.
తమిళనాడు(Tamil Nadu)లోని సేలం కోర్టులో ఓ విచిత్రం జరిగింది. విడాకులు ఇచ్చేసిన తర్వాత కూడా భార్యను చిత్రవిచిత్ర రీతిలో అవమానించాడు ఓ భర్త. విడాకులు ఇచ్చిన భార్యకు ఇవ్వాల్సిన భరణాన్ని చిల్లర నాణేలుగా ఇచ్చాడు. సేలం జిల్లా(Salem District)లో కిడయూరు మెట్టూరు(Mettur)కు చెందిన 57 ఏళ్ల రాజీ ఓ ప్రైవేటు కంపెనీలు క్యాషియర్. ఈయన భార్య శాంతి.. వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. విడిపోవడమే బెటరనుకున్నారు. విడాకులు తీసుకుని విడివిడిగా జీవిస్తున్నారు. ఈ సమయంలో శాంతి భరణం కోసం సంగగిరి రెండో క్రిమినల్ కోర్టులో కేసు వేశారు. శాంతికి ప్రతినెలా 73 వేల రూపాయలు జీవనభృతిగా చెల్లించాలని జడ్జి ఆదేశించారు. కానీ రాజీ మాత్రం ఆ మొత్తాన్ని సరిగ్గా చెల్లించలేదు. దీంతో శాంతి మళ్లీ సంగగిరి కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన జడ్జ్ బకాయి మొత్తాన్ని వెంటనే ఇవ్వాల్సిందిగా రాజీని ఆదేశించారు. భార్యకు ఇవ్వాల్సిన 2 లక్షల 18 వేల రూపాయలను కోర్డుకు తీసుకొచ్చారు రాజీ.. కానీ ఆ మొత్తాన్ని పది రూపాయల నాణేలుగా 11 బస్తాల్లో వేసుకొచ్చాడు. ఇది చూసిన కోర్టు సిబ్బంది బిత్తరపోయారు. భార్య శాంతి అయితే కోపంతో రుసరుసలాడారు. ఇది ఓ రకంగా భార్యను అవమానించడమేనని ఇది చూసిన వారు వ్యాఖ్యానించారు.