ఇన్ని రోజులు మా ఆయన తాగి వేధిస్తున్నాడు, డబ్బలన్నీ మద్యానికే తగిలేస్తున్నాడు, సంసారం నాశనం చేస్తున్నాడు అని బాధపడడం చూశాం కానీ

ఇన్ని రోజులు మా ఆయన తాగి వేధిస్తున్నాడు, డబ్బలన్నీ మద్యానికే తగిలేస్తున్నాడు, సంసారం నాశనం చేస్తున్నాడు అని బాధపడడం చూశాం కానీ ఇప్పుడు సీన్ రివర్సయింది. మా ఆడాళ్లు తాగుబోతులైపో యారని, తమ కష్టాన్ని తాగుడుకే దారపోస్తున్నారని, పురుష లోకం లబోదిబోమంటున్నారు. మద్యానికి బానిసలైన తమ భార్యలు కూలి పనులు చేసిన సంపాదిస్తు న్నదంతా సారాకు తగలే స్తున్నారని, మీరే తమను, తమ కుటుంబాలను ఆదుకోవాలని భర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆశ్చర్యానికి గురయ్యే ఈ సంఘటన ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో వెలుగుచూసింది. బొరిగుమ్మ సమితిలోని పూజారిపుట్ పంచాయతీ కొండగూడ గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు.. తమ భార్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన కొందరు యువకులు గత నాలుగేళ్లుగా నాటు సారా తయారుచేస్తూ విక్రయిస్తు న్నారని తెలిపారు. ఊళ్లో మగాళ్లంతా కూలిపనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారని కానీ తమ ఆడవాళ్లు తమ కష్టాన్ని మద్యానికి తగలేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
దీంతో కుటుంబాలు చిన్నాభిన్నమై.. తమ పిల్లల భవిష్యత్తు అంధకారానికి దారితీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సారా తయారీ స్థావరాలపై దాడులు చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు, ఆబ్కారీ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లిన బాధితులు సారా తయారీని అడ్డుకోవాలని కోరారు.
