ఓ వ్యక్తికి పెళ్లయి ఎనిమేదేళ్లు అవుతోంది. వారిద్దరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. తన భార్యకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఓ వ్యక్తికి పెళ్లయి ఎనిమేదేళ్లు అవుతోంది. వారిద్దరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. తన భార్యకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఎంత చెప్పినా వినకపోవడంతో భార్యకు వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడితో వివాహం జరిపించాడో భర్త. దగ్గరుండి తన భార్య చేతిని ఆ మహనీయుడి చేతిలో పెట్టాడు.
ఈ సంఘటన ఉత్తరప్రదేశ్(UP)లో జరిగింది. సంత్ కబీర్ నగర్(Sant Kabir Nagar)కు చెందిన బబ్లూ (Babloo)అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన రాధిక(radhika)కు 2017లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. కుటుంబాన్ని పోషించేందుకు బబ్లూ ఇతర ప్రాంతాలకు పని కోసం వెళ్లేవాడు. ఈ క్రమంలో రాధికకు అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడి.. అది కాస్త వివాహేతర బంధానికి దారి తీసింది. ఈ విషయం ఇంట్లో తెలిసింది. బబ్లూకు రాధిక వివాహేతర సంబంధం గురించి తమ కొడుక్కి తల్లిదండ్రులు వివరించారు. భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్నా కానీ తనని వదిలేయకుండా.. మార్చాలని ప్రయత్నించాడు. అయినా ఆమె వ్యవహారంలో మార్పు రాలేదు. ఎంత చెప్పినా వినకపోవడంతో ఈ పంచాయతీ గ్రామ పెద్దలకు వివరించాడు. గ్రామపంచాయతీ పెద్దలు మందలించినా ఆమె మారలేదు. తొడ సంబంధం 90 ఏళ్లయినా మానదు అన్న చందంగా భార్య రాధిక తీరు ఉంది. దీంతో చేసేది ఏమీలేక.. వారిద్దరికీ పెళ్లి చేయాలని బబ్లూ నిర్ణయించుకున్నాడు. భార్య లవర్‌ను పిలిచి పెళ్లి చేసుకోండని బంపరాఫర్ వదిలాడు. తన ఇద్దరు పిల్లలను తానే సంతోషంగా చూసుకుంటానని.. మీ ఇద్దరి 'సుఖమే' నాకు ముఖ్యమని తెలిపాడు. దీంతో భార్య రాధిక సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ప్రియుడు కూడా అంగీకరించడంతో భర్తే దగ్గరుండి గ్రామంలోని ఓ ఆలయంలో వివాహం జరిపించి ప్రియుడి చేతిలో తన భార్య చేతిని పెట్టి ఆమెను అప్పగించాడు. అంతేకాకు జాగ్రత్తగా చూసుకోవాలని.. మీరిద్దరూ సుఖంగా ఉండాలని ఆశీర్వదించాడు భార్య చేతిలో మోసపోయిన భర్త. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. బబ్లూ చేసిన పనికి అందరూ ఔరా.. బబ్లూ అనుకుంటున్నారు. రాధికపై దుమ్మెత్తి పోస్తున్నారు.
