భారీ భూకంపంతో ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోయాయి. రిక్టర్ స్కేల్ లో భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. గురువారం మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాల సమయంలో భూకంపం వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.
భారీ భూకంపం( huge earthquake)తో ఉత్తరాది రాష్ట్రాలు(North States) వణికిపోయాయి. రిక్టర్ స్కేల్(Richter scale)లో భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. గురువారం మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాల సమయంలో భూకంపం వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. అఫ్గానిస్తాన్‌లోని హిందూకుష్ (Afghanistan Hindukush) ప్రాంతంలో భూకంప కేంద్రం(epicenter) భూమికి 192 కిలోమీటర్ల దూరంలో ఏర్పడినట్టు భూకంప అధ్యయన కేంద్రం గుర్తించింది. దేశ రాజధాని ఢిల్లీ(Delhi), ఎన్సీఆర్(NCR) పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలతో వణికిపోయాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు..ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. జమ్ముకశ్మీర్ లోని పూంఛ్ జిల్లా, పీర్ పంజాల్ ప్రాంతం, పాకిస్థాన్ లోని లాహోర్(Lahore)లో కూడా దీని తీవ్రత కనిపిచింది. దక్షిణాసియాలోని ముఖ్య దేశాల్లో దీని ప్రభావం కనిపించింది. ఇప్పటికే వరకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు అధికారికంగా వెల్లడి కాలేదు. సాధారణంగా భూకంపాలు ఆసియా ఖండంలో అధికంగా వస్తుంటాయి. అందులోనూ భారత్‌లోని జమ్మూ కశ్మీర్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, తజకిస్థాన్‌లు హింద్ కుష్ హిమాలయాన్ జోన్‌కు చుట్టుపక్కల వీటి కేంద్రాలు ఉంటాయి. ప్రపంచంలోనే అత్యధిక భూకంపాలు నమోదయ్యే జోన్ల జాబితాలో ఇది కూడా ఒకటి. భారత ఉపఖండ భూఫలకం యూరేషియా ఫలకంతో ఢీకొనడమే దీనికి ప్రధాన కారణం.