సూరత్ అంతర్జాతీయ విమానాశ్ర‌యంలో భారీగా బంగారం ప‌ట్టుబ‌డింది. రూ.27 కోట్ల విలువ చేసే 48 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి ఓ అధికారితో పాటు ముగ్గురు ప్రయాణీకులను డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు.

సూరత్ అంతర్జాతీయ విమానాశ్ర‌యం(Surat Airport)లో భారీగా బంగారం(Gold) ప‌ట్టుబ‌డింది. రూ.27 కోట్ల విలువ చేసే 48 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి ఓ అధికారితో పాటు ముగ్గురు ప్రయాణీకులను డీఆర్ఐ (DRI)అధికారులు అరెస్టు చేశారు. సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పని చేస్తున్న కొంత మంది అధికారుల సహాయంతో గోల్డ్ స్మగ్లింగ్(Gold Smuggling) చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు.

ప్లాన్ ప్రకారం.. ఎయిర్ పోర్ట్ లోని ఇమ్మిగ్రేషన్(Immigration)కన్న ముందు ఉన్న వాష్ రూమ్‌(Wash Room)లో బంగారం ఎక్స్చేంజ్ చేశారు. కస్టమ్స్(Customs) అధికారుల స్కానింగ్(Scanning), చెకింగ్(Checkig) కు చిక్కకుండా ఉండడానికి పక్కా ప్లాన్ వేశారు. బంగారాన్ని వాష్ రూమ్‌లో ఓ అధికారికి అప్పగిస్తుండగా అక్కడికి డీఆర్ఐ బృందం చేరుకుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ కేసులో మొత్తం న‌లుగురిని అరెస్ట్ చేశారు. ఎయిర్ పోర్ట్ లో పని చేస్తున్న అధికారుల పాత్ర పై సీరియస్ గా డీఆర్ఐ అధికారులు కూపీ లాగుతున్నారు. ఎంత కాలం నుండి ఈ వ్యవహారం కొనసాగుతుందనే కోణంలో అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 9 July 2023 8:41 PM GMT
Yagnik

Yagnik

Next Story