అయోధ్య(Ayodhya)లో ఈ నెల 22వ తేదీన జరగనున్న శ్రీరాముడి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కనులారా వీక్షించడానికి భక్తులు తరలివెళుతున్నారు. దేశమంతా ఈ మహోత్సవం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఇలాంటి సమయంలో రామాలయం థీమ్‌తో తయారవుతున్న బనారస్‌ చీరలకు బాగా డిమాండ్‌ పెరిగింది.

అయోధ్య(Ayodhya)లో ఈ నెల 22వ తేదీన జరగనున్న శ్రీరాముడి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కనులారా వీక్షించడానికి భక్తులు తరలివెళుతున్నారు. దేశమంతా ఈ మహోత్సవం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఇలాంటి సమయంలో రామాలయం థీమ్‌తో తయారవుతున్న బనారస్‌ చీరలకు బాగా డిమాండ్‌ పెరిగింది. మహిళలు రామాలయం థీమ్‌తో ఉన్న చీరలను కట్టుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని నేత కార్మికులు చీరల పల్లూలపై రామాలయం రామమందిర నమూనా, రామాయణ గాధకు సంబంధించిన పలు ఘట్టాలతో కూడిన డిజైన్‌లను తీర్చిదిద్దుతున్నారు. అయోధ్యలో నూతనంగా నిర్మితమైన రామాలయం ప్రారంభోత్సవంపై వారణాసిలోని చేనేత సంఘాలలో కొత్త ఉత్సాహం వచ్చిందని ముబారక్‌పూర్‌ ప్రాంతానికి చెందిన చేనేత కార్మికుడు అనిసూర్‌ రెహమాన్‌ చెప్పారు. రామాయణ విశేషాలలో తయారుచేసిన చీరలకు చాన్నాళ్ల నుంచి డిమాండ్‌ ఉందని, ఇప్పుడు రామాలయం థీమ్‌తో కూడిన చీరలకు మంచి డిమాండ్‌ వచ్చిందని అన్నారు. రామాలయం థీమ్‌తో రూపొందించిన చీరలు కట్టుకుని, తమ ప్రాంతాల్లో ఈ నెల 22వ తేదీన జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనాలని ఉందని మహిళలు అంటున్నారు.

Updated On 9 Jan 2024 1:54 AM GMT
Ehatv

Ehatv

Next Story