దేశమంతటా శ్రీరామనవమి(Sri Ramanavami) వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా మామిడితోరణాలు, తాటాకు చలువ పందిళ్లు కనిపిస్తున్నాయి. మంగళవాయిద్యాలు సుస్వరంగా వినిపిస్తున్నాయి. పల్లెలైతే పచ్చటి తోరణాలయ్యాయి.

దేశమంతటా శ్రీరామనవమి(Sri Ramanavami) వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా మామిడితోరణాలు, తాటాకు చలువ పందిళ్లు కనిపిస్తున్నాయి. మంగళవాయిద్యాలు సుస్వరంగా వినిపిస్తున్నాయి. పల్లెలైతే పచ్చటి తోరణాలయ్యాయి.
మనసు వెలిగితే రాముడు. మనిషి ఎదిగితే దేవుడు. ధర్మసంస్థాపన కోసం మాధవుడే మనిషిగా అవతరించాడు. పరిపూర్ణ మానవుడంటే ఇలా ఉండాలని లోకానికి చాటి చెప్పాడు. ధర్మ బద్ధ జీవనానికి నిలువెత్తు నిర్వచనం శ్రీరాముడు.
రా..మ.. అంటే కేవలం రెండు అక్షరాలు కాదు. అదో మహాశక్తి మంత్రం. ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముడిని కీర్తిస్తూ భక్తజనం పండుగ జరుపుకొంటున్న శుభ తరుణమిది. శ్రీ మహా విష్ణువు త్రేతాయుగంలో ధర్మస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన రోజే చైత్ర శుక్లపక్ష నవమి శ్రీరామ నవమి. ఈ రోజున ప్రధానంగా మూడు ఘట్టాలు నిర్వహిస్తారు. శ్రీరామ జననం, సీతారాముల కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం. మన సనాతన ధర్మం, పురాణాలు, జ్యోతిషశాస్త్రం ప్రకారం మహా విష్ణువు ప్రతి అవతారానికి ఒక్కో గ్రహం ప్రామాణికంగా ఉంటుంది. ఉదాహరణకు.. నరసింహ అవతారం కుజగ్రహాన్ని సూచిస్తుంది. కృష్ణావతారం చంద్రగ్రహాన్ని సూచిస్తుంది. వామన అవతారం గురుగ్రహం; అలాగే, రామావతారం నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవానుడిని సూచిస్తుంది. రామాయణం(Ramayanam), జ్యోతిషశాస్త్రం ప్రకారం.. శ్రీరాముడు త్రేతాయుగంలోని గురువారం రోజున చైత్ర శుక్ల నవమినందు కర్కాటక లగ్నంలో జన్మించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. రాముని అవతారంలో రాముడు సూర్యవంశంలో జన్మించడం. ఆయన జాతకంలో సూర్యుడు మేషంలో ఉచ్ఛక్షేత్రంలో ఉండటం.. ఇవన్నీ ధర్మస్థాపన కోసం రామావతారం ప్రాధాన్యతను తెలుపుతున్నాయి. మనిషి జీవితంలో ఎలా నడుచుకోవాలి? ఎలా ప్రవర్తించాలి? ఎలా ఉండాలనే అంశాలు రామాయణం ద్వారా తెలుసుకుంటారు. శ్రీరామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన, ఉత్తమ రాజు లక్షణం, ఉత్తమ సోదరుడి కర్తవ్యం.. ఇలా అనేక విషయాలన్నీ రామ అవతారంలో చూసి నేర్చుకోవాల్సిన గొప్ప సుగుణాలు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన శ్రీరాముడిని సనాతన ధర్మంలో పూజించడం వల్ల విజయాలు కలుగుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. మాసాలలో మొదటిది చైత్ర మాసం, సనాతన ధర్మంలో సంవత్సరంలో తొలి పండుగ, తొలి పూజ చైత్ర శుక్ల నవమి రోజు చేసే శ్రీరామ పూజ, వ్రతం.శ్రీరామనవమి రోజు ఏ వ్రతం చేసినా ఫలించదని, కేవలం శ్రీరామవ్రతం మాత్రమే ఫలిస్తుందని, ఈ వ్రతానికి మించినది లేదని పెద్దల వాక్కు. ఈరోజు రామనామస్మరణ చేయడం, రామనామ ధ్యానం చేయడం వల్ల పాపాలు తొలగి, జయాలు సిద్ధిస్తాయి.

Updated On 17 April 2024 1:40 AM GMT
Ehatv

Ehatv

Next Story