మనం ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా, ఏమవుతుందిలే అన్న ధీమాతో ఉన్నా సైబర్ నేరగాళ్ల(Cyber) ఉచ్చులో పడిపోతాం! అంత తెలివిమీరిపోయారు వారు! రోజుకో కేసు వెలుగులోకి వస్తున్న విషయం మనకు తెలియంది కాదు! ఆధునిక టెక్నాలజీని(Technology) ఉపయోగించుకున్న సైబర్ మోసానికి పాల్పడుతున్న వారు పెరిగిపోతున్నారు. ఇప్పుడు మన వేలి ముద్రనే(Finger Prinnt) దొంగిలించి మన బ్యాంక్ అకౌంట్లలోని డబ్బులు కాజేసిన సంఘటనలు జరుగుతున్నాయి. క్లోన్డ్ వేలిముద్రలు తయారు చేసి ఆధార్(Aadhaar) ఎనేబుల్డ్ పేమేంట్ సిస్టం ద్వారా దాదాపు లక్షలాది రూపాయలను తస్కరిస్తున్నారు సైబర్ కేటుగాళ్లు.

ఇప్పుడు అన్నింటికి ఆధార్ కార్డే కావాల్సి వస్తున్నది. బ్యాంక్ అకౌంట్ ప్రారంభించాలన్నా, ప్రభుత్వాల సంక్షేమ పథకాలు కావాలనుకున్నా, సిమ్ కార్డు తీసుకోవాలనుకున్నా ఆధార్ కార్డు(Aadhaar Card) కచ్చితంగా ఉండాలి. ఆధార్‌తో పాటు వేలి ముద్ర(Biometric) కూడా రికార్డు చేయాల్సి ఉంటుంది. అవసరం ఉన్న చోట మనం వేలిముద్రలు వేస్తుంటాం. ఇక్కడే మనం పొరపాటు చేస్తున్నాం. సైబర్ మోసగాళ్లు మన ఫింగర్ ప్రింట్స్ సేకరించి, నగదు దోచుకుంటున్నారు. అయితే ఆధార్ కార్డు లోని వేలి ముద్రలను బయోమెట్రిక్ డేటాను లాక్ చేయడం ద్వారా దుర్వినియోగాన్ని నిలువరించుకోవచ్చు. ఇప్పుడు బయోమెట్రిక్ లాక్ ఎలా చేయాలో తెలుసుకుందాం.
ముందు మై ఆధార్ పోర్టల్‌లోకి వెళల్ఇ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. మై ఆధార్ పోర్టల్‌లోకి ఆధార్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ కావాలి. స్క్రీన్ పై లాక్/ అన్‌లాక్ బయోమెట్రిక్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో ఉన్న గైడ్‌లైన్స్‌ను జాగ్రత్తగా చదవాలి. లాక్, అన్‌లాక్ మనకు ఎలా ఉపయోగపడుతుందనేది విపులంగా ఉంటుంది. అంతా చదివిన తర్వాత ఆ పేజీలోనే కనిపించే నెక్ట్స్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. అప్పుడు Your Biometric Have Been Locked Successfully అనే మెసేజ్ సిస్టమ్‌లో డిస్‌ప్లే అవుతుంది.
లాక్ కాగానే లాక్ లేదా అన్ లాక్ బయో మెట్రిక్ ఆప్షన్ లో ఎరుపు రంగు లాక్ స్క్రీన్‌పై కనబడుతుంది. మరి బయోమెట్రిక్ అన్‌లాక్ ఎలాగో తెలుసుకుందాం! పోర్టల్‌లో లాగిన్ అవ్వగానే లాక్/ అన్‌లాక్ బయోమెట్రిక్ ఆప్షన్ రెడ్ కలర్‌లో కనిపిస్తుంది. ఇలా ఉంటే బయోమెట్రిక్ లాక్ అయిందని అర్థం. అన్‌లాక్ ప్రక్రియ కోసం Please Select To Lock టర్మ్స్ బాక్సులో టిక్ చేసిన తరువాత రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. బయోమెట్రిక్ అన్‌లాక్ తాత్కాలికమా లేదా శాశ్వతంగానా అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ఇక్కడ కావాల్సిన ఆప్షన్ ఎంచుకొని , నెక్ట్స్‌పై క్లిక్ చేయాలి. Your Biometrics Have Been Unlocked Successfully అని స్క్రీన్‌పై కనిపిస్తుంది.
అన్నట్టు తాత్కాలికంగా అన్‌లాక్ ఆప్షన్ ఎంచుకుంటే కేవలం 10 నిమిషాలు మాత్రమే బయోమెట్రిక్ అన్‌లాక్ అవుతుందన్నది మర్చిపోవద్దు.